Bajaj Pulsar 220F : తిరిగొచ్చిన బజాజ్ పల్సర్ 220ఎఫ్.. బుకింగ్స్ షురూ!
18 February 2023, 6:37 IST
- Bajaj Pulsar 220F : పల్సర్ 220ఎఫ్‌ను బజాజ్ రీలాంచ్ చేస్తోంది! గతేడాది డిస్కంటిన్యూ అయిన ఈ మోడల్.. తిరిగి డీలర్షిప్ షోరూమ్‌లకు చేరింది. పూర్తి వివరాలు..
తిరిగొచ్చిన బజాజ్ పల్సర్ 220ఎఫ్.. బుకింగ్స్ షురూ!
Bajaj Pulsar 220F : గతేడాది.. డిస్కంటిన్యూ చేసిన పల్సర్ 220ఎఫ్ మోడల్‌ను దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్.. మళ్లీ తీసుకొస్తోంది! ఇందుకు సంబంధించిన కొత్త యూనిట్లు, ఇప్పటికే డీలర్షిప్ షోరూమ్‌లకు చేరినట్టు సమాచారం. పలు డీలర్షిప్ షోరూమ్‌లు బుకింగ్స్‌ని కూడా ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది. రానున్న కొన్ని వారాల్లో డెలివరీలు సైతం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే.. బజాజ్ పల్సర్ 220ఎఫ్‌ను ఆ సంస్థ ఎందుకు తిరిగి తీసుకొస్తోందో వివరించలేదు. కానీ ఇందుకు రెండు కారణాలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తాయి. ఒకటి.. ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉందని సంస్థ భావిస్తుండటం. రెండోది.. న్యూ జెన్ పల్సర్ 250 మోడల్స్‌కు ఆశించిన మేర డిమాండ్ కనిపించకపోవడం.
బజాజ్ పల్సర్ 220ఎఫ్.. తిరిగొస్తోంది!
Bajaj Pulsar 220F on road price in Hyderabad : పల్సర్ ఎఫ్250, పల్సర్ ఎన్250 మోడల్స్‌తో పల్సర్ 220ఎఫ్‌ను గతేడాది రిప్లేస్ చేసింది బజాజ్ ఆటో. అవి ఈ మోడల్‌కు సక్సెసర్లుగా భావించింది. కానీ ఇప్పుడు పాత మోడల్‌ను మళ్లీ తీసుకొస్తుండటం గమనార్హం.
అయితే.. ఈ బజాజ్ పల్సర్ 220ఎఫ్‌లో భారీ మార్పులు కనిపించకపోవచ్చు. డిస్కంటిన్యూ అవ్వకముందే.. ఈ వెహికిల్ ఒక బీఎస్6 వేరియంట్. ఇక ఇప్పుడు దీనిని ఓబీడీ2 కంప్లైంట్‌గా మార్చాల్సి ఉంటుంది.
బజాజ్ పల్సర్ 220ఎఫ్ ఇంజిన్..
Bajaj Pulsar 220F price : బజాజ్ పల్సర్ 220ఎఫ్‌లో 220 సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఎయిర్ - ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 8500 ఆర్పీఎం వద్ద 20.8 బీహెచ్పీ పవర్‌ను, 7000 ఆర్పీఎం వద్ద 18.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఇక ఈ బైక్‌ను రూ. 1.35లక్షల ఎక్స్‌షోరూం ప్రైజ్‌తో బజాజ్ ఆటో లాంచ్ చేసే అవకాశం ఉంది.
బజాజ్ పల్సర్ పీ150..
Bajaj Pulsar P150 mileage : ఇక బజాజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ పల్సర్ పీ150పై ఆ సంస్థ భారీగా ఆశలు పెట్టుకుంది. న్యూ జెన్ పల్సర్‌లో అతి చౌకైన బైక్ ఇదే. పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్250 బైక్స్‌లో ఉన్న ఇంజిన్ ఇందులో ఉంటుంది. రెండు వేరియంట్లలో ఇది అమ్మకానికి ఉంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1.17లక్షలు. ట్విన్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1.20లక్షలు.