తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Housing Finance : దుమ్మురేపిన బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ- 114శాతం ప్రీమియంతో లిస్టింగ్​!

Bajaj Housing Finance : దుమ్మురేపిన బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ- 114శాతం ప్రీమియంతో లిస్టింగ్​!

Sharath Chitturi HT Telugu

16 September 2024, 10:03 IST

google News
    • Bajaj Housing Finance listing : బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఓపీఓ.. ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చింది! బీఎస్​ఈలో సంస్థ షేర్లు రూ. 150 వద్ద లిస్ట్​ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ షేర్లు లిస్ట్​..
బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ షేర్లు లిస్ట్​..

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ షేర్లు లిస్ట్​..

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ అనుకున్నట్టే స్టాక్​ మార్కెట్​లో బంపర్​ హిట్​ కొట్టింది! బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ లో రూ. 150 వద్ద బజాజ్​ హోసింగ్​ ఫైనాన్స్​ లిస్టింగ్​ జరిగింది. అంటే.. ఐపీఓ ప్రైజ్​ అప్పర్​ బ్యాండ్​ (రూ. 70)తో పోల్చుకుంటే.. బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ షేర్లు అలాట్​ అయిన వారికి మల్టీబ్యాగర్​ రిటర్నులు (114.29శాతం) వచ్చినట్టు!

ఇప్పుడు ప్రాఫిట్​ బుక్​ చేసుకోవాలా? హోల్డ్​ చేయాలా?

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ బిజినెస్​ సాలిడ్​గా ఉందని అనేక మంది స్టాక్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ పనితీరు సైతం బలంగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కేటాయించిన షేర్లను మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు హోల్డ్​ చేసుకోవచ్చని స్టాక్స్​బాక్స్​కి చెందిన రీసెర్చ్​ ఎనలిస్ట్​ ప్రథమేశ్​ మస్దేకర్​ తెలిపారు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం లభిస్తుందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ రీసెర్చ్ - రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అభిప్రాయపడ్డారు.

రూ.97,071 కోట్ల ఏయూఎంతో హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన మాతృసంస్థ బ్రాండ్ 'బజాజ్'ను పరిగణనలోకి తీసుకుని, పరిశ్రమ డిమాండ్​ని క్యాష్ చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

బజాజ్​ ఫైనాన్స్​ హౌసింగ్​ లిస్టింగ్ తరువాత, లిస్టింగ్ లాభం తన అంచనాలకు మించి ఉంటే, కన్జర్వేటివ్​ ఇన్వెస్టర్లు ప్రాఫిట్​ బుకింగ్​ చేసుకోవచ్చని, కాకపోతే.. సంస్థ బిజినెస్​ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే లాంగ్​ టర్మ్​కి సైతం హోల్డ్​ చేసుకోవచ్చని తాప్సే వివరించారు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వివరాలు..

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సెప్టెంబర్ 9న సబ్​స్క్రిప్షన్ కోసం ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగిసింది. సెప్టెంబర్ 12న ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయ్యింది. చివరికి సోమవారం ఈ సంస్థ షేర్లు ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ధర రూ.66 నుంచి రూ.70గా నిర్ణయించారు. కాగా సోమవారం ఉదయం నాటికి బజాజ్​ ఫైనాన్స్​ హౌసింగ్​ జీఎంపీ రూ. 78గా ఉంది. అంటే అప్పర్​ బ్యాండ్​ రూ. 70తో పోల్చుకుంటే.. ఈ సంస్థ షేర్లు రూ. 148 వద్ద లిస్ట్​ అవ్వొచ్చని సూచనలు అందాయి.

రూ.3,560 కోట్ల విలువైన 50.86 కోట్ల ఈక్విటీ షేర్లు, రూ.3,000 కోట్ల విలువైన 42.86 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కలయికతో బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,560.00 కోట్లను సంస్థ సమీకరించింది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రూ.3 లక్షల కోట్లకు పైగా సబ్​స్క్రిప్షన్లతో సరికొత్త రికార్డును సృష్టించింది. ఐపీఓ 63.61 రెట్లు సబ్​స్క్రైబ్ కాగా.. మొత్తం మీద 4,628 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల కోసం వచ్చిన దరఖాస్తుల విలువ దాదాపు రూ.3.24 లక్షల కోట్లు.

కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్, గోల్డ్​మెన్​ సాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో లీడ్ మేనేజర్లుగా ఉండగా, కెఫిన్ టెక్నాలజీస్ ఐపీఓ రిజిస్ట్రార్​గా ఉంది.

తదుపరి వ్యాసం