Bajaj IPO : మార్కెట్‌లోకి బజాజ్ హౌసింగ్ సహా రూ.9,000 కోట్ల విలువైన 16 ఐపీవోలు-rs 9000 crore worth 16 ipos including bajaj housing finance to be out this week check details and gmp ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bajaj Ipo : మార్కెట్‌లోకి బజాజ్ హౌసింగ్ సహా రూ.9,000 కోట్ల విలువైన 16 ఐపీవోలు

Bajaj IPO : మార్కెట్‌లోకి బజాజ్ హౌసింగ్ సహా రూ.9,000 కోట్ల విలువైన 16 ఐపీవోలు

Sep 09, 2024, 04:58 PM IST Anand Sai
Sep 09, 2024, 04:58 PM , IST

  • Bajaj IPO : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి ఓపెన్​ అయ్యింది. ఇప్పటికే రూ.1,758 కోట్ల వరకు అందుకున్నట్టుగా కంపెనీ తెలిపింది. బజాజ్ సహా ఈ వారం మార్కెట్లోకి 16 ఐపీవోలు రానున్నాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సహా 16 ఐపీఓలు ఈ వారం మార్కెట్లోకి రానున్నాయి. ఈ 16 ఐపీవోల మొత్తం మార్కెట్ విలువ రూ.9,000 కోట్లు. ఈ 16 ఐపీవోల్లో ఇప్పటికే 3 ఐపీవోలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి వాటిలో ముఖ్యమైన ఐపీఓ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.

(1 / 5)

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సహా 16 ఐపీఓలు ఈ వారం మార్కెట్లోకి రానున్నాయి. ఈ 16 ఐపీవోల మొత్తం మార్కెట్ విలువ రూ.9,000 కోట్లు. ఈ 16 ఐపీవోల్లో ఇప్పటికే 3 ఐపీవోలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి వాటిలో ముఖ్యమైన ఐపీఓ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.(PTI)

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,758 కోట్లు అందుకున్నట్లు శుక్రవారం తెలిపింది. బజాజ్ హౌసింగ్ ఐపీఓ దరఖాస్తులకు సెప్టెంబర్ 9న అవకాశం ఉంది. బజాజ్ హౌసింగ్ ఐపీఓ ధర రూ.66 నుంచి రూ.70 మధ్య ఉంది.

(2 / 5)

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,758 కోట్లు అందుకున్నట్లు శుక్రవారం తెలిపింది. బజాజ్ హౌసింగ్ ఐపీఓ దరఖాస్తులకు సెప్టెంబర్ 9న అవకాశం ఉంది. బజాజ్ హౌసింగ్ ఐపీఓ ధర రూ.66 నుంచి రూ.70 మధ్య ఉంది.(PTI)

బజాజ్ హౌసింగ్‌లో క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులకు 50 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా ఉంది. బజాజ్ ఐపీఓ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 11గా ఉంది.

(3 / 5)

బజాజ్ హౌసింగ్‌లో క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులకు 50 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా ఉంది. బజాజ్ ఐపీఓ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 11గా ఉంది.(PTI)

ఐపీవో దరఖాస్తుల తొలిరోజు బజాజ్ హౌసింగ్ షేర్లు రూ.56 ప్రీమియంతో అమ్ముడయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ అంచనా వేస్తోంది. అంటే లిస్టింగ్ సమయంలో 70 రూపాయల షేర్ 126 రూపాయలు కావచ్చు. ఇది పెట్టుబడిదారులకు 80 శాతం లాభాన్ని ఇస్తుంది. బజాజ్ హౌసింగ్ మొత్తం రూ.6560 కోట్ల ఐపీఓను ప్రారంభించింది.

(4 / 5)

ఐపీవో దరఖాస్తుల తొలిరోజు బజాజ్ హౌసింగ్ షేర్లు రూ.56 ప్రీమియంతో అమ్ముడయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ అంచనా వేస్తోంది. అంటే లిస్టింగ్ సమయంలో 70 రూపాయల షేర్ 126 రూపాయలు కావచ్చు. ఇది పెట్టుబడిదారులకు 80 శాతం లాభాన్ని ఇస్తుంది. బజాజ్ హౌసింగ్ మొత్తం రూ.6560 కోట్ల ఐపీఓను ప్రారంభించింది.(REUTERS)

మరోవైపు పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.1,100 కోట్ల ఐపీవోకు సెప్టెంబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది. ఇదిలావుండగా క్రాస్ ఐపీఏ అప్లికేషన్ ఈ రోజు ప్రారంభమైంది. 500 కోట్ల ఐపీఓను మార్కెట్లోకి విడుదల చేసింది. 230 కోట్ల విలువైన టోలిన్స్ టైర్స్ ఐపీఓ నేటి నుంచి విడుదలైంది. క్రాస్ అండ్ టోలిన్స్ టైర్స్ ఐపీఓకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 11 చివరి తేదీగా ఉంది.

(5 / 5)

మరోవైపు పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.1,100 కోట్ల ఐపీవోకు సెప్టెంబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది. ఇదిలావుండగా క్రాస్ ఐపీఏ అప్లికేషన్ ఈ రోజు ప్రారంభమైంది. 500 కోట్ల ఐపీఓను మార్కెట్లోకి విడుదల చేసింది. 230 కోట్ల విలువైన టోలిన్స్ టైర్స్ ఐపీఓ నేటి నుంచి విడుదలైంది. క్రాస్ అండ్ టోలిన్స్ టైర్స్ ఐపీఓకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 11 చివరి తేదీగా ఉంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు