Bajaj Freedom 125 : బజాజ్ సీఎన్జీ బైక్‌కి సూపర్ డిమాండ్- పండగ సీజన్లో మీరూ కొనాలా?
17 September 2024, 10:00 IST
- Bajaj Freedom 125 price in Hyderabad : పండగ సీజన్లో కొత్త బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తున్న బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే!
బజాజ్ ఫ్రీడమ్ 125
ఇండియాన్ 2 వీలర్ సెగ్మెంట్‌తో పాటు ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌గా గుర్తింపు పొందిన బజాజ్ ఫ్రీడమ్ 125కి మంచి డిమాండ్ కనపిస్తోంది. సంస్థ అంచనాలకు మించి బుకింగ్స్ వచ్చాయి. ఇక ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ డెలివరీలు మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అందుబాటు ధర, ఆకర్షణీయమైన డిజైన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ మోటార్ సైకిల్ మంచి ప్రిఫరెన్స్ అవుతుంది. సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, గొప్ప ఇంధన సామర్థ్యం వంటివి బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్‌కి ప్లస్ పాయింట్స్‌గా ఉన్నాయి. ఈ పండగ సీజన్లో మీరు కొత్త బైక్ కొనాలని చూస్తుంటే.. బజాజ్ ఫ్రీడమ్ 125 గురించి ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్ ఫ్రీడమ్ 125: మోడ్రన్ డిజైన్
డిజైన్ పరంగా బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ ఇతర కమ్యూటర్ బైక్‌ల మాదిరిగా లేదు! ఇది ప్రీమియం లుక్‌ని ఇచ్చే, ఆలోచనాత్మకంగా చేర్చిన ఆధునిక స్టైలింగ్స్ని కలిగి ఉంది. ఎక్స్ పోజ్డ్ ఫ్రేమ్, ట్యాంక్ కవర్స్, హెక్సాగోనల్ ఫ్రంట్ ల్యాంప్ వంటి అంశాలు బైక్ మొత్తం ఆకర్షణను పెంచుతాయి.
బజాజ్ ఫ్రీడమ్ 125: విశాలమైన సీటింగ్
సీఎన్జీ బైక్ సీటు సెగ్మెంట్లోనే పొడవైన సీట్లలో ఒకటి. 785 ఎంఎం సామర్థ్యం ఉన్న ఈ సీటులో రైడర్, బైక్‌పై కూర్చోవడానికి తగినంత స్థలం ఉంది. దీనికి అదనంగా, సీటు ఫ్లాట్‌గా, సిటీ ఉపయోగానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125: డ్యూయెల్ ఫ్యూయల్ ఆప్షన్స్
ఈ మోటార్ సైకిల్లో సీఎన్జీస పెట్రోల్ అనే రెండు ఆప్షన్స్ ఉండటం ప్లస్ పాయింట్. సీఎన్జీ ట్యాంక్ 2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్‌ను కూడా 2 లీటర్ల వరకు నింపవచ్చు. బజాజ్ పేర్కొన్నట్లుగా ఈ బైక్ మొత్తం 300 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది!
బజాజ్ ఫ్రీడమ్ 125: టెక్నాలజీ
బ్లూటూత్ కనెక్టివిటీ కాల్ అలర్ట్స్తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మిస్డ్ కాల్ నోటిఫికేషన్లు, బ్యాటరీ లైఫ్ ఇండికేటర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి కొత్త తరం ఫీచర్లను ఈ సీఎన్జీ బైక్‌లో అందిస్తుంది. వీటిని చూస్తే తక్కువ ధరకి లభిస్తున్నా, మంచి ఫీచర్స్ మిస్ అవ్వడం లేదన్న ఫీలింగ్ కలుగుతుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125: సరసమైన ధర
ఒక వాహనంపై డబ్బు ఆదా చేయడంలో అత్యంత ముఖ్యమైన భాగం మీరు దానిని కొనుగోలు చేస్తున్నప్పుడు, మెయిన్టైన్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో, వాహనం ధర పెరుగుతుంది, అయితే రన్నింగ్- నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అయితే ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ రూ .94,995 (ఎక్స్-షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతుంది. రన్నింగ్ ఖర్చులు సైతం 50 శాతం వరకు తగ్గుతుందని తెలుస్తోంది.
మరి ఈ బజాజ్ సీఎన్జీ బైక్ మీకు నచ్చిందా? ఈ పండగ సీజన్లో కొనుగోలు చేస్తారా?
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.