Swift CNG vs Tiago CNG : ఈ రెండు సీఎన్జీ కార్లలో దేని మైలేజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ?-swift cng vs tiago cng specs fuel efficiency safety and prices compared ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swift Cng Vs Tiago Cng : ఈ రెండు సీఎన్జీ కార్లలో దేని మైలేజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ?

Swift CNG vs Tiago CNG : ఈ రెండు సీఎన్జీ కార్లలో దేని మైలేజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ?

Sharath Chitturi HT Telugu
Sep 14, 2024 05:43 AM IST

Swift CNG vs Tiago CNG : మారుతీ సుజుకీ స్విఫ్ట్​ సీఎన్జీ వర్సెస్​ టాటా టియాగో సీఎన్జీ- ఏ కారు మైలేజ్​ ఎక్కువ? ఏ కారు ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు సీఎన్జీ కార్లలో దేని మైలేజ్​ ఎక్కువ?
ఈ రెండు సీఎన్జీ కార్లలో దేని మైలేజ్​ ఎక్కువ?

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలు, ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు సీఎన్జీ వెహికిల్స్​కి కూడా మంచి డిమాండ్​ ఉంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు పోటీ పడి మరీ కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఈ సెగ్మెంట్​లో అత్యధిక మార్కెట్​ షేరు కలిగి ఉన్న మారుతీ సుజుకీ సంస్థ తాజాగా.. స్విఫ్ట్​ సీఎన్జీని లాంచ్​ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్​లో ఉన్న టాటా టియాగో సీఎన్జీకి గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? దేని మైలేజ్​ ఎక్కువ? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

స్విఫ్ట్ సీఎన్జీ వర్సెస్ టియాగో సీఎన్జీ: ఇంజిన్, పర్ఫార్మెన్స్​..

కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీ 1,200సీసీ పెట్రోల్ ఇంజిన్​ కలిగి ఉంది. ఇది పెట్రోల్​పై 81 బీహెచ్​పీ పవర్​, 112 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీఎన్జీ మోడ్​లో.. 5,700 ఆర్​పీఎమ్ వద్ద 69 బీహెచ్​పీ పవర్, 2,900 ఆర్​పీఎమ్ వద్ద 102 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్​ బాక్స్​తో వస్తుంది.

ఇదీ చూడండి:- Yamaha R15M launch: కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్ తో యమహా ఆర్15ఎమ్ లాంచ్; ధర ఎంతంటే?

మరోవైపు, టాటా టియాగో సీఎన్జీ 1,200సీసీ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్​ని పొందుతుంది. ఇది 6,000 ఆర్​పీఎమ్ వద్ద 85 బీహెచ్​పీ పవర్​, పెట్రోల్ మోడ్​లో 3,300 ఆర్పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ మోడ్​లో టియాగో 6,000 ఆర్​పీఎమ్ వద్ద 72 బీహెచ్​పీ పవర్, 3,500 ఆర్​పీఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టియాగో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 5-స్పీడ్ ఏఎమ్​టీతో సహా రెండు గేర్​బాక్స్ ఆప్షన్స్​తో వస్తుంది.

స్విఫ్ట్ సీఎన్జీ వర్సెస్ టియాగో సీఎన్జీ: ఇంధన సామర్థ్యం..

మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీ ఇంధన సామర్థ్యం కిలోకు 31 కిలోమీటర్లు. టాటా టియాగో సీఎన్జీ కిలోకు 26.5 కిలోమీటర్లు. అంటే టియాగో సీఎన్జీ కన్నా స్విఫ్ట్​ సీఎన్జీ మైలేజ్​ చాలా చాలా ఎక్కువ!

స్విఫ్ట్ సీఎన్జీ వర్సెస్ టియాగో సీఎన్జీ: భద్రత

జీఎన్​సీఏపీ పరీక్షలో టియాగోకు 4-స్టార్ రేటింగ్ రాగా, యూరో ఎన్​సీఏపీ పరీక్షల్లో స్విఫ్ట్​కి 3-స్టార్ రేటింగ్ వచ్చింది.

రెండు హ్యాచ్​బ్యాక్​లలో డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. టియాగోకు స్టెబిలిటీ కంట్రోల్ కూడా లభిస్తుంది.

స్విఫ్ట్ సీఎన్జీ వర్సెస్ టియాగో సీఎన్జీ: ధర

కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్జీ ధర రూ .8.19 లక్షల నుంచి రూ .9.19 లక్షలు (ఎక్స్-షోరూమ్). టియాగో సీఎన్జీ రూ .7.39 లక్షల నుంచి 8.74 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంది.

మరి మీకు ఏ సీఎన్జీ వెహికిల్​ నచ్చింది? మీరు ఏది కొనుగోలు చేస్తున్నారు?

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం