Ather 450 Apex vs TVS X : ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఏది బెస్ట్?
08 January 2024, 12:45 IST
- Ather 450 Apex vs TVS X : ఏథర్ 450 అపెక్స్ వర్సెస్ టీవీఎస్ ఎక్స్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఏది బెస్ట్?
Ather 450 Apex vs TVS X : బెంగళూరు ఆధారిత ఏథర్ ఎనర్జీ సంస్థ.. తాజాగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. దీని పేరు ఏథర్ 450 అపెక్స్. ఈ స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎక్స్‌కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ 450 అపెక్స్ వర్సెస్ టీవీఎస్ ఎక్స్- ఫీచర్స్..
ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో స్పెషల్ ఇండియమ్ బ్లూ పెయింట్ స్కీమ్‌తో కూడిన ట్రాన్స్పరెంట్ బాడీ ప్యానెల్ ఉంటుంది. ఏప్రాన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెట్లైట్, ఫ్లష్ ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, యాంగ్యులర్ కాస్ట్ టైప్ మిర్రర్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 7 ఇంచ్ ఫుల్ కలర్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ వంటివి వస్తున్నాయి.
TVS X price Hyderabad : మరోవైపు టీవీఎస్ ఎక్స్‌లో వర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కార్నరింగ్ లైట్స్, వైడ్ హ్యాండిల్‌బార్, షార్ప్ లుకింగ్ సైడ్ ప్యానెల్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 10.2 ఇంచ్ టీఎఫ్టీ స్క్రీన్ లభిస్తోంది.
ఏథర్ 450 అపెక్స్ వర్సెస్ టీవీఎస్ ఎక్స్- రేంజ్..
Ather 450 Apex electric scooter : ఏథర్ 450 ఈ-స్కూటర్లో 7 కేడబ్ల్యూ మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుది. ఇది.. 3.7 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 157కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది.
ఇక టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 11కేడబ్ల్యూ మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఇది.. 3.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 140కి.మీల దూరం ప్రయాణిస్తుంది.
రైడర్ సేఫ్టీ కోసం ఈ రెండు స్కూటర్స్లోనూ.. డిస్క్ బ్రేక్స్ (ఫ్రెంట్, రేర్ వీల్స్), కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్, రీజనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటివి వస్తున్నాయి.
ఏథర్ 450 అపెక్స్ వర్సెస్ టీవీఎస్ ఎక్స్- ధర ఎంతంటే..
Ather 450 Apex price : ఇండియాలో.. ఏథర్ 450 అపెక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.89లక్షలుగా ఉంది. ఇక టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.5లక్షలుగా. ఇదొక ప్రీమియం ఈ-స్కూటర్.
ఇండియా 2 వీలర్ ఈవీ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. టీవీఎస్ ఎక్స్‌కి మంచి సేల్స్ ఉన్నాయి. మరి ఏథర్ 450 అపెక్స్ ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి.