తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ask Automotive Ipo: ఆస్క్ ఆటోమోటివ్స్ ఐపీఓ; తొలిరోజే 35 రూపాయల జీఎంపీ; అప్లై చేయొచ్చా?

ASK Automotive IPO: ఆస్క్ ఆటోమోటివ్స్ ఐపీఓ; తొలిరోజే 35 రూపాయల జీఎంపీ; అప్లై చేయొచ్చా?

HT Telugu Desk HT Telugu

07 November 2023, 15:38 IST

google News
    • ASK Automotive IPO: ఆస్క్ ఆటోమోటివ్ ఐపీఓ మంగళవారం ఓపెన్ అయింది. తొలిరోజే గ్రే మార్కెట్లో రూ. 35 ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy company website)

ప్రతీకాత్మక చిత్రం

ASK Automotive IPO: ఆస్క్ ఆటోమోటివ్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ మంగళవారం ప్రైమరీ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఐపీఓకు నవంబర్ 9వ తేదీ వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 268 నుంచి రూ. 282 మధ్య ఉంది. ఈ ఐపీఓ ద్వారా 29,571,390 తాజా షేర్లను సేల్ చేస్తున్నారు. తద్వారా రూ. 834 కోట్లను సమీకరించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో, ASK ఆటోమోటివ్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌ (ASK Automotive IPO GMP)లో ట్రేడింగ్‌లో ఉన్నాయి. మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ASK ఆటోమోటివ్ లిమిటెడ్ షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో రూ. 35 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి.

ఐపీఓ వివరాలు..

ఈ ఐపీఓ (ASK Automotive IPO) ప్రైస్ బ్యాండ్ రూ. 268 నుంచి రూ. 282 మధ్య ఉంది. మధ్య ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి రిటైల్ పోర్షన్ లో 0.33 రెట్టు సబ్ స్క్రైబ్ అయింది. ఎన్ఐఐ పోర్షన్ 0.16 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. మొత్తంగా 0.20 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఇన్వెస్టర్లు లాట్స్ గా అప్లై చేసుకోవచ్చు. ఒక్కో లాట్ లో 53 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఒక్కో లాట్ కు గరిష్ట ధరలో ఇన్వెస్టర్ రూ. 14,946 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 10 వ తేదీన అలాట్మెంట్ జరిగే అవకాశం ఉంది. అలాగే, నవంబర్ 14న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

అప్లై చేయొచ్చా?

ఈ ఐపీఓ పై కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ సానుకూల స్పందనను వెలువరించింది. "2 సంవత్సరాల CAGR ప్రకారం FY2021-23కి పన్ను తర్వాత ఆదాయం మరియు లాభం 29% మరియు 3% పెరిగింది. సప్లై చైన్ సమస్యల కారణంగా లాభాలలో కొంత తగ్గుదల నమోదైంది. ఈ ఐపీఓకు సబ్‌స్క్రయిబ్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము" అని తెలిపింది. రిలయన్స్ సెక్యూరిటీస్ కూడా సబ్ స్క్రైబ్ ట్యాగ్ నే ఈ ఐపీఓకు ఇస్తోంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మంచి ఫలితాలను సాధిస్తోందని, అందువల్ల సబ్ స్క్రైబ్ చేయాలని సూచిస్తున్నామని తెలిపింది.

తదుపరి వ్యాసం