ESAF Bank IPO: అట్రాక్టివ్ జీఎంపీతో ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ ఐపీఓ; అప్లై చేయడంపై నిపుణుల సూచనలు ఇవే..
ESAF Small Finance Bank IPO: ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ ఈ రోజు మార్కెట్లోకి వచ్చింది. ప్రైస్ బ్యాండ్ రూ. 57 నుంచి రూ. 60 మధ్య ఉంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేయాలా? వద్దా?.. నిపుణులు ఏమంటున్నారు.
ESAF Small Finance Bank IPO: ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ కు నవంబర్ 3 వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. రూ. 57 నుంచి రూ. 60 ప్రైస్ బ్యాండ్ ను ఈ ఐపీఓకు నిర్ధారించారు. బ్యాంక్ ఉద్యోగుల్లో అర్హులైన వారు రూ. 5 డిస్కౌంట్ తో సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ లాట్ సైజ్ 250 ఈక్విటీ షేర్స్. 13 లాట్స్ వరకు సబ్ స్క్రైబ్ చేయవచ్చు.
ఉద్యోగులకు డిస్కౌంట్
ఈ ఐపీఓ లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్యూఐబీ () లకు 50% షేర్లను కేటాయించింది. ఎన్ఐఐలకు 15% షేర్లను కేటాయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 35% షేర్లను కేటాయించింది. గురువారం, నవంబర్ 2వ తేదీన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 135.15 కోట్ల ను సమీకరించింది. వారికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 60 చొప్పున మొత్తం 2,25,24,998 షేర్లను కేటాయించింది. బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్, కాప్తాల్ మారిషస్, ఫౌండర్స్ కలెక్టివ్ ఫండ్, ఏసీఎం గ్లోబల్ వీసీసీ ఫండ్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, అనంత క్యాపిటల్ వెంచర్స్, ఆల్కెమ్.. తదితర సంస్థలు ఈ యాంకర్ ఇన్వెస్టర్లలో భాగంగా ఉన్నారు.
జీఎంపీ, అలాట్మెంట్..
ఈ ఐపీఓ షేర్ అలాట్మెంట్ నవంబర్ 10వ తేదీన జరుగుతుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో నవంబర్ 16వ తేదీన లిస్ట్ అవుతుంది. కాగా, ఐపీఓ ప్రారంభమైన తొలిరోజు గ్రే మార్కెట్లో ఈ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు రూ. 22 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే లిస్టింగ్ రోజు ఇష్యూ ప్రైస్ కన్నా కనీసం రూ. 22 ఎక్కువ ధరతో ఇవి ట్రేడ్ అవుతాయి. అయితే, మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ జీఎంపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
సబ్ స్క్రైబ్..
ఈ ఐపీఓకు పలు బ్రోకరేజ్ సంస్థలు సబ్ స్క్రైబ్ ట్యాగ్ ను ఇస్తున్నాయి. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారత్ లో ఐదవ అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని, ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని బీపీ ఈక్విటీస్ సంస్థ సూచిస్తోంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ ఐపీఓ కు సబ్ స్క్రైబ్ చేయవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ లిమిటెడ్ చెబుతోంది.
సూచన: ఈ కథనంలోని సూచనలు నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలు. హిందుస్తాన్ తెలుగుతో వీటికి సంబంధం లేదు. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.
టాపిక్