Cello World IPO : సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?-cello world ipo issue sees tepid response on day 1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cello World Ipo : సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?

Cello World IPO : సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?

Sharath Chitturi HT Telugu
Oct 30, 2023 06:18 PM IST

Cello World IPO : సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ జీఎంపీతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత?
సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ షురూ.. అప్లై చేయాలా? జీఎంపీ ఎంత? (https://celloworld.com/)

Cello World IPO : సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ సోమవారం ఓపెన్​ అయ్యింది. ఈ ఐపీఓ.. మొదటి రోజు 31శాతం సబ్​స్క్రైబ్​ అయ్యిందని డేటా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

సెల్లో వరల్డ్​ ఐపీఓ..

సోమవారం ఓపెన్​ అయిన ఈ సెల్లో వరల్డ్​ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​.. బుధవారం, అంటే నవంబర్​ 1న ముగుస్తుంది. ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్ షేరుకు​ రూ. 617- రూ. 648. ఐపీఓ కచ్చితంగా అలాట్​ అవ్వాలని అనుకుంటే.. రూ.648 అయిన అప్పర్​ బ్యాండ్​ ప్రైజ్​ని కోట్​ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ఫేస్​ వాల్యూ రూ. 5

Cello World IPO subscription status : ఈ ఐపీఓ వాల్యూ రూ. 1,900 కోట్లు. ఇందులో 50శాతం షేర్లను క్యూఐబీ (క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్స్​)లకు కేటాయించింది సంస్థ. ఎన్​ఐఐ (నాన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్లు) వాటా 15శాతంగా ఉంది. ఇక రీటైర్లకు 35శాతం వాటా కేటాయించారు. ఎంప్లాయీ సబ్​స్క్రిప్షన్​ కూడా ఉంది. వీరు ప్రైజ్​ బ్యాండ్​ కన్నా రూ. 61 (షేరుకు) తక్కువగానే ఐపీఓను అప్లై చేసుకోవచ్చు.

తొలి రోజులో భాగంగా.. సెల్లో వరల్డ్​ ఐపీఓను రీటైల్​ ఇన్​వెస్టర్ల కేటగిరీలో 32శాతం మంది, ఎన్​ఐఐ కేటగిరీలో 72శాతం మంది, క్యూఐబీ కేటగిరీలో 2శాతం మంది, ఎంప్లాయీ కేటగిరీలో 40శాతం మంది అప్లై చేసుకున్నారు.

గ్రే మార్కెట్​ ప్రీమియం ఎంత..?

Cello World IPO GMP : సెల్లో వరల్డ్​ ఐపీఓ గ్రే మార్కెట్​ ప్రీమియం 135గా ఉంది. అంటే.. స్టాక్​ మార్కెట్​లో ఈ ఐపీఓ.. రూ. 783 వద్ద లిస్ట్​ అవుతుందని సెకెండరీ మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి (648+135). అయితే.. ఒక ఐపీఓల కోసం వాటి జీఎంపీని చూడటం మంచిదే కానీ, కేవలం అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అప్లై చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

సెల్లో వరల్డ్​ సంస్థ భారతీయులకు సుపరిచితమే. స్టేషనరీ, రైటింగ్​ ఇన్​స్ట్రుమెంట్స్​, మౌల్డెడ్​ ఫర్నీచర్​, కన్జ్యూమర్​ హౌజ్​వర్​ వంటి రంగాల్లో ఈ సంస్థ వ్యాపారాలు చేస్తుంది. ముఖ్యంగా.. సెల్లో వరల్డ్​ పెన్స్​ చాలా ఫేమస్​.

Whats_app_banner

సంబంధిత కథనం