తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Watch - Chatgpt: యాపిల్ వాచ్‍లో చాట్‍జీపీటీ.. ప్రత్యేక యాప్ వచ్చేసింది

Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్‍లో చాట్‍జీపీటీ.. ప్రత్యేక యాప్ వచ్చేసింది

10 March 2023, 11:41 IST

google News
    • Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్ యూజర్లు ఇక వాచ్‍లోనే చాట్‍జీపీటీ సర్వీసులను పొందవచ్చు. ఇందుకోసం వాచ్‍జీటీపీ (WatchGPT) యాప్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలివే..
Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్‍లో చాట్‍జీపీటీ.. ప్రత్యేక యాప్ వచ్చేసింది (twitter: Hidde van der Ploeg)
Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్‍లో చాట్‍జీపీటీ.. ప్రత్యేక యాప్ వచ్చేసింది (twitter: Hidde van der Ploeg)

Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్‍లో చాట్‍జీపీటీ.. ప్రత్యేక యాప్ వచ్చేసింది (twitter: Hidde van der Ploeg)

Apple Watch - ChatGPT: యాపిల్ వాచ్‍ వాడుతున్న వారికి గుడ్‍న్యూస్ ఇది. ఇక మీ యాపిల్ వాచ్‍లోనే చాట్‍జీపీటీ సర్వీస్‍ వాడుకోవచ్చు. మీ వాచ్ స్క్రీన్‍ నుంచి ఏఐ చాట్‍బోట్ చాట్‍జీపీటీని ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. చాట్‍జీపీటీ (ChatGPT) తో టెక్స్ట్ రూపంలో ముచ్చటించొచ్చు. కావాల్సిన సమాచారాన్ని మణికట్టు నుంచే పొందవచ్చు. చాట్‍జీపీటీ సేవలను యాపిల్ వాచ్‍లో అందించేందుకు వాచ్‍జీపీటీ (WatchGPT) యాప్ వచ్చింది. ఈ వాచ్‍జీపీటీ యాప్‍లో చాట్‍జీపీటీ సర్వీసులను యాపిల్ వాచ్ యూజర్లు పొందవచ్చు. వాచ్‍జీపీటీ యాప్ ధర ఇండియాలో రూ.349గా ఉంది. యాపిల్ యాప్ స్టోర్‍(Apple App Store) లో ఈ యాప్ అందుబాటులో ఉంది. వాచ్‍జీపీటీ వివరాలు, బెనిఫిట్స్ ఇవే..

Apple Watch - WatchGPT App: హిడ్డె వాన్ డెర్ ప్లోయెగ్ (Hidde van der Ploeg) ఈ వాచ్‍జీపీటీ యాప్‍ను డెవలప్ చేశారు. ఈ వాచ్‍జీపీటీ యాప్ ఇండియా సహా చాలా దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వాచ్‍జీటీపీ బెనిఫిట్స్

Apple Watch - WatchGPT App: వాచ్‍జీపీటీ యాప్‍లో చాట్‍జీటీపీ సేవలను పొందవచ్చు. వాచ్‍లోని వాచ్‍జీటీపీని ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు. ఈ ఆన్సర్లను వాచ్ స్క్రీన్ నుంచే నుంచే మెయిల్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా షేర్ చేయవచ్చు. ప్రశ్నలకు సమాధానాలను పొందడమే కాదు.. టైప్ చేసే అవసరం లేకుండా ఎక్కువ టెక్స్ట్ ఉండే మెసేజ్‍లను జనరేట్ చేసుకోవచ్చు.

Apple Watch - WatchGPT App: ఐఓఎస్ 13.0 లేదా అంతకంటే తర్వాతి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న యాపిల్ వాచ్‍లకు ఈ వాచ్‍జీపీటీ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ డౌన్‍లోడ్ సైజ్ 2.6ఎంబీగా ఉంది. యాపిల్ యాప్ స్టోర్‍లో ఇంగ్లిష్, డచ్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఈ యాప్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‍నకు మరిన్ని ఫీచర్లను త్వరలో తీసుకురానున్నట్టు డెవలపర్ పేర్కొన్నారు.

ఓపెన్ ఏఐ(OpenAI)కి చెందిన చాట్‍జీపీటీ (ChatGPT) చాట్‍బోట్ టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దాదాపు అన్ని ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు ఇస్తుండటంతో ఈ ప్లాట్‍ఫామ్ చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం చాట్‍జీపీటీ వెబ్‍ అందుబాటులో ఉంది. మొబైళ్లకు చాట్‍జీపీటీకి సంబంధించిన అధికారిక యాప్ అందుబాటులోకి రాలేదు. అయితే బ్రౌజర్లో వెబ్‍ వెర్షన్‍ చాట్‍జీపీటీని వాడుకోవచ్చు. కోడింగ్ నుంచి కుకింగ్ వరకు, మ్యాథమ్యాటిక్స్ నుంచి హిస్టరీ వరకు.. ఏ ప్రశ్నకైనా చాట్‍జీటీపీ ఆన్సర్ చెప్పేస్తోంది.

తదుపరి వ్యాసం