Amazon sale : అమెజాన్ సేల్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు..!
06 October 2023, 13:00 IST
- Amazon sale 2023 : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి క్రేజీ న్యూస్! అమెజాన్ సేల్‌లో కొన్ని డివైజ్‌లపై అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
అమెజాన్ సేల్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు..!
Amazon Great Indian Festival : మచ్ అవైటెడ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023.. రెండు రోజుల్లో మొదలవుతోంది. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికైతే.. 24 గంటల ముందే ఈ సేల్ లైవ్ అవుతుంది. ఇక 'అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్స్’ పేరుతో 25వేలకుపైగా ప్రాడక్ట్స్ మీద క్రేజీ డిస్కౌంట్లు ఇస్తోంది ఈ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ. ఈ నేపథ్యంలో పలు ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్స్‌పై లభిస్తున్న ఆఫర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ 12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ వాస్తవ ధర రూ. 1,31,999. కానీ అమెజాన్ ఆఫర్లో దీనిని రూ. 84,999కి కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 10వేల అదనపు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇక పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేస్తే.. కొత్త డివైజ్‌పై రూ. 37,500 వరకు తగ్గింపు సైతం లభిస్తుండటం విశేషం.
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ..
Amazon sale 2023 : సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 99,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా రూ. 7వేల వరకు డిస్కౌంట్ వస్తోంది. పాత డివైజ్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 47,500 వరకు ఎక్స్ట్రా తగ్గింపును పొందవచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 5జీ..
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 5జీ 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,54,999కి అమెజాన్ సేల్‌లో దక్కించుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా రూ. 7వేల తగ్గింపు కూడా వస్తోంది. పాత ఫోన్స్‌ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 49,500 వరకు తగ్గింపు పొందొచ్చు.
రియల్మీ నార్జో 60 5జీ..
Amazon Kick Starter deals : ఈ రియల్మీ నార్జో 60 5జీని 18శాతం డిస్కౌంట్‌తో రూ. 16,499ని కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్‌పై రూ. 1500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ..
అమెజాన్‌లో ఐకూ జెడ్6 లైట్ 5జీ 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేంజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో రూ .1250 తగ్గింపు లభిస్తోంది. పాత డివైజ్‌తో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వస్తోంది.