తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Prime Video New Plan : తక్కువ ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్.. నెలకు రూ.50 ఖర్చుతో!

Amazon Prime Video New Plan : తక్కువ ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్.. నెలకు రూ.50 ఖర్చుతో!

07 November 2022, 15:26 IST

google News
  • Amazon Prime Video New Annual Plan : తక్కువ ధరలో అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ కావాలనుకునే వారి కోసం మొబైల్ ఎడిషన్ ప్లాన్ లాంచ్ అయింది. ఈ కొత్త సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.

తక్కువ ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ లాంచ్
తక్కువ ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ లాంచ్ (Screengrab)

తక్కువ ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ లాంచ్

Amazon Prime Video New Annual Plan : పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కొత్త ప్లాన్ లాంచ్ అయింది. తక్కువ ధరలో మొబైల్ ఎడిషన్ (Amazon Prime Video Mobile Edition) వార్షిక ప్లాన్‍ను ఇండియాలో లాంచ్ చేసింది అమెజాన్. రూ.599 ధరతో ఈ మొబైల్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది సంవత్సరం ప్లాన్‍గా ఉంది.

రూ.599 మొబైల్ ఎడిషన్ ప్లాన్ తీసుకుంటే సంవత్సరమంతా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ పొందచ్చు. అంటే నెలకు రూ.50ఖర్చుతో ఈ ప్లాన్ వాడుకోవచ్చు. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.1,499 ప్లాన్‍తో పోలిస్తే ఇది చాలా విభిన్నంగా ఉంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.599 మొబైల్ ఎడిషన్ పూర్తి వివరాలు ఇవే.

Amazon Prime Video 599 Mobile Edition : ఒకే డివైజ్‍లో..

రూ.599 మొబైల్ ఎడిషన్ ప్లాన్ తీసుకుంటే యూజర్ ఏకకాలంలో ఒకే డివైజ్‍లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోను వినియోగించుకోగరు. ఈ ప్లాన్‍తో ఒక మొబైల్‍లోనే ప్రైమ్ వీడియో కంటెంట్ చూడగలరు. ఒకే అకౌంట్‍తో ఎక్కువ డివైజ్‍ల్లో లాగిన్ అవలేరు. ఒకటి కంటే ఎక్కువ ఫ్రొఫైల్స్ సెట్ చేసుకోలేరు.

Amazon Prime Video 599 Mobile Edition : స్టాండర్డ్ డెఫినేషన్‍లోనే..

అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.599 మొబైల్ ఎడిషన్ ప్లాన్‍ను తీసుకుంటే ప్లాట్‍ఫామ్‍లోని వీడియో కంటెంట్‍ను స్టాండర్డ్ డెఫినేషన్ (SD) రెజల్యూషన్‍లోనే చూడొచ్చు. హెచ్‍డీ, 4కేలో కంటెంట్‍ను చూసే అవకాశం ఉండదు.

రూ.1,499 (సంవత్సరం), రూ.179 (నెల) ప్లాన్‍లు తీసుకుంటే యూజర్.. ఒకే అకౌంట్‍తో ఏకకాలంలో మూడు డివైజ్‍ల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోను వినియోగించుకోవచ్చు. హెచ్‍డీ, 4కే రెజల్యూషన్‍లోనూ కంటెంట్ చూడొచ్చు. అమెజాన్ మ్యూజిక్‍తో పాటు ఫాస్ట్ డెలివరీ లాంటి అమెజాన్ షాపింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.599 మొబైల్ ఎడిషన్ ప్లాన్‍తో షాపింగ్, మ్యూజిక్ లాంటి అదనపు బెనిఫిట్స్ ఉండవు. తక్కువ ధరలో ప్రైమ్ వీడియో కంటెంట్ మాత్రమే చాలు అనుకునే వారికి రూ.599 ప్లాన్ సూటవుతుంది.

డిస్నీ+ హాట్‍స్టార్, నెట్‍ఫ్లిక్స్, వూట్ లాంటి ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుండటంతో అమెజాన్ ఈ కొత్త ప్రైమ్ వీడియో ప్లాన్‍ను లాంచ్ చేసింది. యూజర్ కు నెలకు కేవలం రూ.50 ఖర్చయ్యేలా మొబైల్ ఎడిషన్‍ను తీసుకొచ్చింది. అదనపు ప్రయోజనాల్లో కోత విధించింది.

గతంలో ఎయిర్ టెల్ రూ.299 ప్లాన్‍తో మొబైల్ ఓన్లీ అమెజాన్ ప్రైమ్ సబ్‍స్క్రిప్షన్ లభించేంది. ఇప్పుడు మొబైల్ ఎడిషన్ పేరుతో యూజర్లందరికీ ఈ రూ.599 వార్షిక ప్లాన్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది.

తదుపరి వ్యాసం