HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Deals On Smartwatches: అమెజాన్ సేల్ లో ఈ ఐదు ప్రీమియం స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్

Deals on smartwatches: అమెజాన్ సేల్ లో ఈ ఐదు ప్రీమియం స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్

Sudarshan V HT Telugu

27 September 2024, 16:54 IST

  • Amazon Great Indian Festival 2024: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ కొనసాగుతోంది. ప్రైమ్ మెంబర్స్ కు ఎక్స్ క్లూజివ్ సేల్ ముగిసిన తరువాత సెప్టెంబర్ 27 నుంచి అన్ని ఆఫర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తున్న టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితా ఇక్కడ ఉంది.

స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్
స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్ (Apple)

స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్స్

మీ ఆరోగ్యాన్ని, ఫిట్ నెస్ ను మెయింటెయిన్ చేయడానికి అడ్వాన్స్డ్ ఫీచర్లతో నిండిన స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో పలు ప్రీమియం స్మార్ట్ వాచ్ లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. వాటిలో ఆపిల్, వన్ ప్లస్, అమెజ్ ఫిట్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కు చెందిన టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాను మీ కోసం తీసుకువచ్చాం. చూడండి.

టాప్ 5 స్మార్ట్ వాచ్ డిస్కౌంట్స్

అమేజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్

మీరు ఫిట్నెస్ ఔత్సాహికులైతే, ఈ స్మార్ట్వాచ్ (Smartwatch) మీకు సరైన ఎంపిక కావచ్చు. అమేజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ స్క్రాప్స్ ను, స్క్రాచెన్ ను తట్టుకునే కఠినమైన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను జెప్ తో అనుసంధానం చేశారు. ఇది AI ద్వారా వ్యక్తిగతీకరించిన శిక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 16 రోజుల వరకు బ్యాటరీని అందిస్తుంది, ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ ఫ్రెండ్ గా మారుతుంది. అమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ వాచ్ రూ.4799 ధరకు లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6

శాంసంగ్ (samsung) గెలాక్సీ వాచ్ 6 అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇది ఆరోగ్యం, ఫిట్నెస్ ట్రాకింగ్ కు ఎంతో సహాయపడుతుంది. శాంసంగ్ వాలెట్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్స్, బ్లడ్ ప్రెజర్ అండ్ ఈసీజీ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, కస్టమైజ్డ్ హెచ్ ఆర్ జోన్స్ వంటి ఫీచర్లను ఈ శాంసంగ్ వాచ్ 6 స్మార్ట్ వాచ్ అందిస్తుంది. అమెజాన్ సేల్లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.19,399కే లభిస్తుంది.

వన్ ప్లస్ వాచ్ 2ఆర్

అనేక హెల్త్, ఫిట్ నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ వాచ్ (Smart watch) ఇది. వన్ ప్లస్ వాచ్ 2ఆర్ లో స్నాప్ డ్రాగన్ డబ్ల్యూ5తో పాటు BES2700 డ్యూయల్ చిప్ సెట్లు ఉన్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. ఇది స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, హార్ట్ రేట్ వార్నింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. వన్ ప్లస్ వాచ్ 2ఆర్ అమెజాన్ సేల్ లో రూ.12,999 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 9

ఆపిల్ వాచ్ (Apple Watch) సిరీస్ 9 అత్యంత ఖరీదైన స్మార్ట్ వాచ్ ల్లో ఒకటి. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకు లభిస్తుంది. ఆరోగ్యం, భద్రత, యాక్టివిటీకి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లను వినియోగదారులకు అందించడానికి ఈ ఆపిల్(APPLE) స్మార్ట్ వాచ్ ఎస్ 9 చిప్ తో పనిచేస్తుంది. వినియోగదారులు వారి మణికట్టు నుండి రక్తంలో ఆక్సిజన్, ఈసీజీ స్థాయిలు, గాఢ నిద్ర, మరెన్నో ట్రాక్ చేయవచ్చు.

అమేజ్ ఫిట్ యాక్టివ్

కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో స్మార్ట్ వాచ్ అమేజ్ ఫిట్ యాక్టివ్. ఇది ఫీచర్ లోడెడ్ స్మార్ట్ వాచ్. ఇందులో 1.75 అంగుళాల హెచ్ డీ అమోఎల్ఇడి డిస్ప్లే, ఏఐ-పవర్డ్ జెప్ కోచ్, 24 గంటల హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు, మరెన్నో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (amazon great indian festival) సందర్భంగా ఈ స్మార్ట్ వాచ్ రూ. 4799 ధరకు లభ్యం కానుంది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్