Smart Watches Discount : టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. 67 శాతం వరకు తగ్గింపు-top brand smart watches with huge discount on online noise boat amazfit and other with up to 67 percentage off ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Watches Discount : టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. 67 శాతం వరకు తగ్గింపు

Smart Watches Discount : టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. 67 శాతం వరకు తగ్గింపు

Anand Sai HT Telugu
Aug 08, 2024 10:34 AM IST

Amazon Sale 2024 : స్మార్ట్ వాచ్‌ కొనాలి అనుకునేవారికి ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. భారీ డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్‌లో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్‌లు ఉన్నాయి. 67 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్
స్మార్ట్‌ వాచ్‌లపై భారీ డిస్కౌంట్

ఆగస్టు నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. పండుగలు ప్రారంభం కావడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డీల్స్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు మంచి ఫీచర్లతో ఉన్న స్మార్ట్ వాచ్ కోసం చూస్తుంటే.. తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నాయిస్, బోట్, అమేజ్‌పిట్ వంటి వివిధ బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం..

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3

ఈ నాయిస్ స్మార్ట్‌వాచ్ అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. ఇది వినియోగదారుల ఫిట్‌నెస్ అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది. బ్లూటూత్ కాలింగ్, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. 24 గంటల హృదయ స్పందన రేటు, SpO2 మానిటర్, మరెన్నో అప్‌డేట్స్ ఇస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 అసలు ధర రూ.8999, అయితే అమెజాన్ సేల్‌లో కొనుగోలుదారులు కేవలం Rs.2999కు పొందవచ్చు.

రెడ్‌మీ వాచ్ 3

ఈ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెడ్‌మీ వాచ్ 3.. 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఫిట్‌నెస్‌ను అదుపులో ఉంచుకోవడానికి 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, ఎస్పీఓ2, హార్ట్ రేట్ వంటి 24 గంటల హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రెడ్‌మీ వాచ్ 3 ధర రూ.5,999 కాగా, సేల్‌లో కేవలం రూ.2650కే లభిస్తుంది.

బోట్ లూనార్ పీక్

బోట్ లూనార్ పీక్ స్మార్ట్‌వాచ్ హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్, నిద్ర, మరెన్నో వంటి అనేక ఆరోగ్య మానిటరింగ్ ఫీచర్లతో వస్తుంది. మీకు పరిమిత బడ్జెట్ ఉంటే ఈ స్మార్ట్‌వాచ్ సరసమైన ఎంపిక కావచ్చు. బోట్ లూనార్ పీక్ ధర రూ.6999 కాగా, ఇప్పుడు కేవలం రూ.2499కే లభిస్తోంది.

అమేజ్‌ఫిట్ బిప్ 5

మీరు ఆరోగ్యం, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌లో మరింత కచ్చితత్వం కోసం చూస్తున్నట్లయితే అమేజ్‌ఫిట్ బిప్ 5 మీకు బెటర్ ఆప్షన్. 120 స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్ లెవెల్, స్లీప్ క్వాలిటీ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఉన్నాయి. అమేజ్‌ఫిట్ బిప్ 5 ఇప్పుడు 37 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దీని అసలు ధర రూ.7999 ఉండగా.. రూ.5000కు లభిస్తుంది.

లావా ప్రోవాచ్ జెడ్ఎన్

లావా ప్రోవాచ్ జెడ్ఎన్ 1.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 600 నిమిషాల గరిష్ట బ్రైట్‌నెస్ అందిస్తుంది. రీడింగ్ హెల్త్, ఫిట్నెస్ మ్యాట్రిక్స్‌లో కచ్చితత్వం కోసం RTL8763EWE-వీపీ చిప్‌సెట్, వీసీ9202+వీపీ60ఏ పీపీజీ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఇందులో బిల్ట్-ఇన్ గేమ్స్, కాలిక్యులేటర్, వాయిస్ అసిస్టెంట్, మరెన్నో ఉన్నాయి. లావా ప్రోవాచ్ జెడ్ఎన్ ధర రూ.4999 కాగా, అమెజాన్ సేల్లో ఇది కేవలం రూ.2829కే లభిస్తుంది.

టాపిక్