Affordable SUV : ప్రీమియం లుక్స్, ఫీచర్స్‌తో అఫార్డిబుల్ ఎస్యూవీ- స్కోడా కైలాక్ ఫుల్ ప్రైజ్ లిస్ట్..
02 December 2024, 16:44 IST
- Skoda Kylaq price : స్కోడా కైలాక్ ఫుల్ ప్రైజ్ లిస్ట్‌ని సంస్థ రివీల్ చేసింది. ఈ కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అఫార్డిబుల్ ఎస్‌యూవీగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అఫార్డిబుల్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ స్కోడా కైలాక్..
భారత మిడిల్ క్లాస్ ప్రజల కోసం మరో అఫార్డిబుల్ సబ్- కాంపాక్ట్ ఎస్యూవీ అందుబాటులోకి వచ్చింది! అదే.. స్కోడా కైలాక్ ఎస్యూవీ. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ. 7.8లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఇప్పటికే ప్రకటించిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు, ఫుల్ ప్రైజ్ లిస్ట్‌ని రివీల్ చేసింది. ఫలితంగా.. హై డిమాండ్ ఉన్న ఎస్యూవీ సెగ్మెంట్లో అఫార్డిబుల్ మోడల్స్‌లో ఒకటిగా ఈ స్కోడా కైలాక్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ధరలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్కోడా కైలాక్ ఎస్యూవీ ధరలు..
టాప్ స్పెక్ స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ .14.40 లక్షలు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ ఎక్స్‌షోరూం ధర రూ .13.35 లక్షలు.
మిడ్ స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ ఎక్స్‌షోరూం ధరలు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ రూ.9.59 లక్షలు, రూ.11.40 లక్షలు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఎక్స్‌షోరూం ధరలు రూ.10.59 లక్షలు, రూ.12.40 లక్షలుగా ఉన్నాయి.
స్కోడా కైలాక్ ఎస్యూవీ బుకింగ్స్ డిసెంబర్ 2 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి 33,333 మంది కొనుగోలుదారులకు 3 సంవత్సరాల పాటు ఉచిత మెయింటెనెన్స్ కూడా లభిస్తుంది! స్కోడా కైలాక్ డెలివరీలు జనవరి 27, 2025న ప్రారంభమవుతాయి.
స్కోడా కైలాక్ డిజైన్..
మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూలకు పోటీగా ఈ కైలాక్ ఎస్యూవీ ఉంటుంది. స్కోడా కైలాక్ మోడ్రన్-సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్‌ని పొందుతుంది. ఇది స్ల్పిట్ హెడ్ ల్యాంప్స్, బాక్సీ సిల్హౌట్, కాంపాక్ట్ ఓవర్ హాంగ్లను కలిగి ఉంది. సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్ కొత్త కాంటెంపరరీ డిజైన్ని పొందుతుంది. 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ హై వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్‌ల్యాంప్స్ అన్ని వేరియంట్లలో వస్తుంది.
స్కోడా కైలాక్: ఫీచర్లు- ఇంజిన్..
స్కోడా కైలాక్ 1.0 లీటర్ 3 సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్ టచ్‌స్క్రీన్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రు మెంట్ ప్యానెల్‌ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని పొందుతుంది.
కైలాక్ ప్రెస్టీజ్‌లో వెంటిలేషన్‌తో కూడిన 6-వే పవర్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, ప్రతి వేరియంట్ సింగిల్ లేదా డ్యూయల్ టోన్‌లో ప్రత్యేకమైన క్యాబిన్ అప్హోలిస్ట్రీని పొందుతుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ + మోడళ్లకు ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ ఒక స్టాండర్డ్ సెటప్! ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో పాటు ప్రెస్టీజ్ ఆల్ లెదర్-అప్ హోల్స్ట్రీగా ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా, ఈ ఎస్యూవీ 25కి పైగా యాక్టివ్, పాసివ్ ఫీచర్లను పొందుతుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, మల్టీ కొలిషన్ బ్రేకింగ్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.