తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Cars : ఎలక్ట్రిక్​ వాహనాలపై షాకింగ్​ సర్వే- ‘మాకు ఈవీలు వద్దు’ అంటున్న 51శాతం మంది ఓనర్లు!

Electric cars : ఎలక్ట్రిక్​ వాహనాలపై షాకింగ్​ సర్వే- ‘మాకు ఈవీలు వద్దు’ అంటున్న 51శాతం మంది ఓనర్లు!

Sharath Chitturi HT Telugu

27 July 2024, 12:22 IST

google News
    • ఈవీలపై ఇండియాలో జరిగిన ఓ సర్వేలో షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి. 51శాతం మంది రెండోసారి ఎలక్ట్రిక్​ వాహనాలు కొనకూడదని నిర్ణయించుకున్నారు!
లక్ట్రిక్​ వాహనాలపై షాకింగ్​ సర్వే
లక్ట్రిక్​ వాహనాలపై షాకింగ్​ సర్వే (REUTERS)

లక్ట్రిక్​ వాహనాలపై షాకింగ్​ సర్వే

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తున్న సమయంలో ఒక షాకింగ్​ సర్వే బయటకు వచ్చింది. 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులపై నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది రెండో ఈవీని కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదని తేలింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) కార్లకు మారేందుకు వారు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది. 

కార్​ ఓనర్స్​కి వివిధ సేవలు అందించే పార్క్​+ ఈ సర్వే చేసింది. దిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ సర్వే జరిగిందని, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యజమానుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సర్వే నిర్వహించామని పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ లఖోటియా చెప్పారు.

ఈవీలు వద్దంటున్న వారి అసలు సమస్య ఛార్జింగ్​! 88 శాతం మందిలో ఛార్జింగ్ ఆందోళన అతిపెద్ద కారణమని, రేంజ్ యాంగ్జైటీ కంటే ఇది ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉందని సర్వే నివేదించింది. చాలా మంది డ్రైవర్లు 50 కిలోమీటర్ల పరిధిలో చిన్న ఇంటర్సిటీ ట్రిప్పులు చేయడానికి ఇష్టపడతారని, అందువల్ల, రేంజ్ ముఖ్యం కాదని సర్వే పేర్కొంది. ఛార్జింగ్​ స్టేషన్లు కనిపించకపోవడం సమస్య అని సర్వే పేర్కొంది. భారతదేశంలో 20,000 కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, సురక్షితమైన, పనిచేసే ఛార్జింగ్ స్టేషన్​లు దొరక్కపోవడం చాలా మంది ఈవీ కార్ల యజమానులకు అతిపెద్ద ఆందోళన.

అధిక మరమ్మతు ఖర్చులు- తక్కువ రీసేల్ విలువ!

ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులకు అధిక ఖర్చు అవుతుండటం ఈవీ కార్ల యజమానుల ఆందోళనకు మరొక ప్రధాన కారణం అని పార్క్+ తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది తమ ఈవీ కార్లు తమకు అర్థం కాని బ్లాక్ బాక్స్ లాంటివని పేర్కొన్నారు. ఒక EVలోని యాంత్రిక భాగాలు, ఎలక్ట్రికల్ కాంపోనెంట్​ల సంక్లిష్టత మరమ్మత్తులు తలనొప్పిగా మారినట్టు, స్థానిక మెకానిక్​లు సైతం సమస్యలపై పనిచేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు రీపేర్​ అయ్యే ఖర్చుపై అనేక రిపైర్​ షాప్​లు రెండో ఆప్షన ఇవ్వలకపోతుండటంతో డబ్బు ఖర్చు పెరుగుతోందని అన్నారు.

ఉపయోగించిన ఐసీఈ కార్ల రీసేల్ విలువ వాటి వయస్సు, మైలేజీని బట్టి నిర్ణయిస్తారు. ఒక నిర్దిష్ట మోడల్ డిమాండ్ కూడా ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల రీసేల్ వ్యాల్యూ గణనీయంగా పడిపోతోందని, సర్వేలో పాల్గొన్న వారిలో 33 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందుకే ఐసీఈ కార్లకు తిరిగి మారాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈవీలోని బ్యాటరీ కారు మొత్తం విలువలో 30 శాతం ఉంటుంది. ఇది కాలక్రమేణా క్షీణిస్తుంది. అటువంటి క్షీణతను కొలిచే పరీక్షలు లేకపోవడం రీసేల్ విలువ పడిపోవడానికి ఒక ప్రధాన కారణం. కొనుగోలుదారులు- యజమానులకు ప్రధాన అవరోధంగా నిలుస్తుంది.

ఐసీఈ కార్ల యజమానుల కంటే సగటున ఈవీ కార్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారని, మొదటిసారి సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను నిర్వహించే పరిశ్రమ సమస్యలో భాగమని సర్వేలో తేలింది.

“ఇండియాలో 4వాట్​ ఈవీ స్టోరీ కొనసాగుతోంది. కానీ రోబస్ట్​, స్మార్ట్​ ఈవీ ఛార్జింగ్​ వెసులుబాటులను నిర్మిచాల్సిన అవసరం చాలా ఉంది,” అని లఖోటియా అన్నారు.

తదుపరి వ్యాసం