ఈ స్కూటీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 170 కి.మీ మైలేజీ.. కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్.. ఇంకా అదిరిపోయే ఫీచర్లు-ivoomi unveils new variant of jeetx ze with 3 kwh battery with 170 mileage know its price and smart features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ స్కూటీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 170 కి.మీ మైలేజీ.. కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్.. ఇంకా అదిరిపోయే ఫీచర్లు

ఈ స్కూటీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 170 కి.మీ మైలేజీ.. కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్.. ఇంకా అదిరిపోయే ఫీచర్లు

Anand Sai HT Telugu
Jul 16, 2024 01:00 PM IST

iVOOMi Jeet X ZE : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటిగా ఉన్న IVOOMI Electric Scooter కంపెనీ అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లను తీసుకొస్తుంది. 3 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన జీత్ ఎక్స్ జెడ్ఈ కొత్త వేరియంట్ను విడుదల చేసింది. లక్ష లోపు ధరలో వచ్చే ఈ స్కూటర్ 170 కిలోమీటర్ల మెలేజీ అందిస్తుంది.

జీత్ఎక్స్ జెడ్ఈ కొత్త వెరియంట్
జీత్ఎక్స్ జెడ్ఈ కొత్త వెరియంట్ (iVOOMi)

3 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన జీత్ ఎక్స్‌జెడ్ఈ కొత్త వేరియంట్‌ను IVOOMI Electric Scooter విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో సంచలన సృష్టించనుంది. ఈ స్కూటర్ ధర రూ.99,999గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి నగరాల్లోని డీలర్షిప్‌ల వద్ద స్థానిక రిజిస్ట్రేషన్‌తో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

జీత్ ఎక్స్‌జెడ్ఈ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ బిల్డింగ్, 3 కెడబ్ల్యుహెచ్ వేరియంట్ అండర్ బోన్ ఫ్రేమ్‌తో రూపొందించారు. భారతదేశంలో దీనికి మంచి మార్కెట్ ఉంది. ఇది 42 మిమీ వ్యాసార్థంతో టెన్సిల్ ఇఆర్ డబ్ల్యు 1 స్టీల్ ట్యూబ్‌లతో తయారు అయింది.

మొబైల్ యాప్ కనెక్టివిటీతో కూడిన అధునాతన స్మార్ట్ స్పీడో మీటర్‌తో కొత్త వేరియంట్ వస్తుంది. ఇది రైడర్లకు అనేక ఫీచర్లను అందిస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్స్, ట్రిప్ డేటా, ఎస్ఓసీ అలర్ట్స్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. దీంతోపాటు బ్యాటరీ ఛార్జింగ్ శాతం వివరాలు కూడా కనిపిస్తాయి.

జీత్ ఎక్స్‌జెడ్ఈ 3 కెడబ్ల్యుహెచ్ వేరియంట్ మూడు విభిన్న రైడింగ్ మోడ్ లను కలిగి ఉంది. దీనికి ఎకో మోడ్ ఉంటుంది. 170 కిలోమీటర్ల మేలేజీ అందిస్తుంది. సిటీ రైడ్స్, లాంగ్ ట్రిప్పులకు ఇది అనువుగా ఉంటుంది. ఇది కాకుండా రైడర్ మోడ్ అందుబాటులో ఉంది, ఇది 140 కిలోమీటర్ల పరిధితో రోజువారీ రైడింగ్‌కు గొప్ప ఎంపిక. ఇది కాకుండా స్పీడ్ మోడ్ ఉంది, దీనిలో మీరు 130 కిలోమీటర్ల దూరాన్ని వేగంగా కవర్ చేయవచ్చు.

స్కూటర్ గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది గొప్ప టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. సిటీ ట్రిప్‌కు ఇది మంచి ఎంపిక. బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీ వస్తుంది. ఈ వేరియంట్ డెలివరీలు జూలై చివరి నుండి ఆగస్టు వరకు ప్రారంభమవుతాయి. అధునాతన ఫీచర్లు, ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఈ స్కూటర్ బాగా ప్రభావాన్ని చూపనుంది.

జీత్ ఎక్స్‌జెడ్ఈ 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ను లాంచ్ చేయడం కస్టమర్ అవసరాలను తీర్చడంలో మా సృజనాత్మకత, అంకితభావాన్ని తెలియజేస్తుందని ఐవోఓఎంఐ సీఈఓ, కో ఫౌండర్ అశ్విన్ భండారీ అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన పనితీరు అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Whats_app_banner