Vespa Dragon 946 Price : వెస్పా డ్రాగన్ 946 స్కూటర్.. బండి మాత్రం కిర్రాక్.. కానీ ధర చూస్తేనే-vespa dragon 946 launched in india priced 14 27 lakhs check complete details about scooter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vespa Dragon 946 Price : వెస్పా డ్రాగన్ 946 స్కూటర్.. బండి మాత్రం కిర్రాక్.. కానీ ధర చూస్తేనే

Vespa Dragon 946 Price : వెస్పా డ్రాగన్ 946 స్కూటర్.. బండి మాత్రం కిర్రాక్.. కానీ ధర చూస్తేనే

Anand Sai HT Telugu
Jul 01, 2024 09:15 PM IST

Vespa Dragon 946 Price and Other Details : వెస్పా డ్రాగన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ బండి చూసేందుకు మాత్రం సూపర్‌గా ఉంటుంది. కానీ ఒక్క విషయం గురించి మాత్రం మిడిల్ క్లాస్ వాళ్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

వెస్పా డ్రాగన్ 946
వెస్పా డ్రాగన్ 946

భారత మార్కెట్లో ఆటో రంగంలోకి అనేక కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫోర్ వీలర్ మార్కెట్ పై కన్నేశాయి. వీటిలో ఒకటి వెస్పా ఇండియా. ఇది భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ బ్రాండ్ ఇటీవల తన లగ్జరీ స్కూటర్ వెస్పా 946 డ్రాగన్‌ను విడుదల చేసింది.

దీని ధర మాత్రం రూ .14.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది వెస్పా ప్రత్యేకమైన డిజైన్. ప్రపంచవ్యాప్తంగా 1,888 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

గోల్డెన్ కలర్ బాడీపై డ్రాగన్

ఈ స్కూటర్ వెస్పా 946 యొక్క ప్రత్యేక రూపం. ఇది ప్రత్యేకమైన స్టైలింగ్ కు ప్రసిద్ధి చెందింది. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ లో లేత బంగారు రంగు బాడీపై ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డ్రాగన్ ఆకారాన్ని చాలా అందంగా చిత్రీకరించారు. ఈ స్కూటర్ అద్దాలు, రియర్ ర్యాక్, చక్రాలకు విస్తరించింది. ఇది దాని బండి అందాన్ని మరింత పెంచేలా ఉంది.

వెస్పా 946 డ్రాగన్ స్పెసిఫికేషన్లు

వెస్పా 946 డ్రాగన్ 155 సీసీ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ స్కూటర్ స్టీల్ ప్లేట్ మోనోకాక్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ముందు భాగంలో సింగిల్-ఆర్మ్ షాక్ అబ్జార్బర్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ముందు, వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ వస్తుంది.

వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. స్టైలిష్‌గా కనిపించాలని అనుకునేవారికి ఈ స్కూటర్ ఒక కల. ఈ బండి మీద మీరు వెళ్తుంటే రోడ్డుపై అందరూ మిమ్మల్నే చూస్తారు.

భారతదేశంలో వెస్పా 946 డ్రాగన్ బుకింగ్స్ అన్ని మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. మీరు ఈ ప్రత్యేక వెస్పా డ్రాగన్‌ను మీ ఇంటి ముందు ఉంచాలనుకుంటే.. త్వరగా బుక్ చేయండి.

WhatsApp channel