తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Cars : పది లక్షలలోపు ధరతో త్వరలో వచ్చే కార్లు.. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా

Upcoming Cars : పది లక్షలలోపు ధరతో త్వరలో వచ్చే కార్లు.. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా

Anand Sai HT Telugu

08 October 2024, 9:43 IST

google News
    • Upcoming Cars In India : ప్రస్తుతం భారత్‌లో పండుగల సీజన్ నడుస్తోంది. దీంతో కంపెనీలు కార్లపై పలు ఆఫర్లు ప్రకటించాయి. మరికొన్ని కార్ల తయారీ కంపెనీలు కొత్త వాటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అలా పది లక్షలలోపు ధరతో వచ్చే కార్లు ఏవో చూద్దాం..
కొత్తగా రానున్న కార్లు
కొత్తగా రానున్న కార్లు

కొత్తగా రానున్న కార్లు

మార్కెట్‌లో కార్లపై బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి. పండుగల సీజన్ కావడంతో డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు కొన్ని కంపెనీలు తమ కొత్త కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి పది లక్షల రూపాయల లోపు ధరతో వచ్చే కార్లు ఏవో తెలుసుకుందాం.. ఇందులో రెండు ప్రసిద్ధ సెడాన్‌లు, సరికొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఫేస్‌లిఫ్ట్‌ రానున్నాయి.

న్యూ జెన్ హోండా అమేజ్

నివేదికల ప్రకారం, కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.7.93 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బడ్జెట్‌లో సెడాన్ కారు కావాలనుకునే వారికి బెటర్ ఆప్షన్. ఈ కారు అధునాతన ఫీచర్లను కూడా పొందుతుంది. ముఖ్యంగా 7.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే. దీంతో పాటు 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా అమేజ్ డిజైన్‌లను పరిశీలిస్తే.., ఈ కారుకు LED టర్న్ సిగ్నల్ ఇండికేటర్‌తో కూడిన ORVMలు ఉన్నాయి. ఈ అద్దాలు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఈ కారుకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.

మారుతి సుజుకి డిజైర్

నివేదికల ప్రకారం, నాల్గో తరం మారుతి సుజుకి డిజైర్ ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. మునుపటి తరం డిజైర్ మాదిరిగానే రాబోయే సెడాన్ కూడా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. అయితే, మునుపటి వెర్షన్‌లాగా కాకుండా, మారుతి స్విఫ్ట్ నుండి భిన్నంగా కనిపించేలా సీరియస్ ఎక్ట్సీరియర్ రీడిజైన్ చేయనుంది. హెడ్‌లైట్లు, ఫ్రంట్ గ్రిల్, బంపర్, ఫాగ్ ల్యాంప్‌లను రీడిజైన్ చేయనున్నారు. ఇది హ్యాచ్‌బ్యాక్ నుండి పూర్తిగా భిన్నమైనది కాదు. అయితే డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు ఉండనున్నాయి. హెడ్‌లైట్లు స్విఫ్ట్ కంటే భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. అల్లాయ్ వీల్స్ డిజైన్ భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా XUV 3XO

ఇటీవల, కొత్త మహీంద్రా XUV 3XO EV (ఎలక్ట్రిక్ కార్) మోడల్ టెస్ట్ డ్రైవ్‌లు చేస్తూ కనిపించింది. కొత్త కారుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇంధనంతో నడిచే కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు డిజైన్‌లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా XUV400 EV (ఎలక్ట్రిక్ కారు), 34.5 kWh మరియు 39.5 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఇది వరుసగా 375 నుండి 456 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రాబోయే XUV3XO EV 34.5V బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై సుమారు 375 కిమీ రేంజ్ ఉంటుందని అంచనా.

తదుపరి వ్యాసం