తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Classic 350 : అప్డేటెడ్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ఎలా ఉండబోతోంది? లాంచ్​ రేపే..

Royal Enfield Classic 350 : అప్డేటెడ్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ఎలా ఉండబోతోంది? లాంచ్​ రేపే..

Sharath Chitturi HT Telugu

11 August 2024, 7:20 IST

google News
    • 2025 Royal Enfield Classic 350 : రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350 బ్రాండ్​కు బెస్ట్ సెల్లర్! ఇప్పుడు దీనికి అప్డేటెడ్​ వర్షెన్​ రాబోతోంది. ఎప్పుడు లాంచ్​ అంటే..
The 2025 Royal Enfield Classic 350 will arrive with a nip and tuck on the cosmetic and feature front, while retaining the same appeal
The 2025 Royal Enfield Classic 350 will arrive with a nip and tuck on the cosmetic and feature front, while retaining the same appeal (Sabyasachi Dasgupta/HT Auto)

The 2025 Royal Enfield Classic 350 will arrive with a nip and tuck on the cosmetic and feature front, while retaining the same appeal

రాయల్ ఎన్​ఫీల్డ్​ తన క్లాసిక్ 350 బైర్​ని ఆగస్టు 12, 2024 న విడుదల చేయనుంది. కొత్త క్లాసిక్​ 350లో పలు కీలక అప్డేట్స్​ కనిపిస్తాయని సమాచారం. ప్రత్యర్థులకు మరింత పోటీనిచ్చే విధంగా మోడల్​ను మరింత సముచితంగా ఉంచడానికి అనేక అట్రాక్టివ్​ ఫీచర్ మార్పులతో రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 వస్తుందని తెలుస్తోంది. గత నెలలో బ్రాండ్ వాల్యూమ్స్​లో ఎనిమిది శాతం క్షీణతను చూసినందున, అమ్మకాలు పెంచుకునేందుకు పండుగ సీజన్​కి ముందు​ ఈ అప్డేట్​ని సంస్థ తీసుకొస్తోంది. ఈ  నేపథ్యంలో 2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350పై ఇప్పటివరుక ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350..

అప్డేటెడ్​ రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350లో అదే డిజైన్ ఉండనుంది. కానీ సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందొచ్చు. కొత్త పెయింట్ ఆప్షన్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ సహా సవరించిన ఫీచర్ల జాబితా బయటకు రావొచ్చు. మోడ్రన్ క్లాసిక్ మోటార్ సైకిల్ టాప్ వేరియంట్లలో చాలా కొత్త ఫీచర్లతో సవరించిన వేరియంట్ లైనప్్​ను పొందుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ మరింత సమాచారంతో అప్​గ్రేడ్​ కూడా పొందొచ్చు. ఈ మోడల్ తన తాజా అవతారంలో డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి వివరాలను పొందవచ్చు. అంతేకాక, టాప్-ఎండ్ క్లాసిక్ 350లోని ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ప్రస్తుత మోడల్ కంటే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది సంస్థ.

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 స్పెసిఫికేషన్లు

రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 మెకానికల్స్​లో పెద్ద మార్పులను ఆశించవద్దు. ఈ అప్డేటెడ్ బైక్ జే-సిరీస్ 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్​ను ఉపయోగిస్తుంది. ఇది 6,100 ఆర్​పీఎమ్ వద్ద 20.2 బీహెచ్​పీ పవర్, 4,000 ఆర్​పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులతో కూడిన ట్విన్ డౌన్​ట్యూబ్​ స్పైన్ ఫ్రేమ్, వెనుక భాగంలో 6-స్టెప్స్ ప్రీలోడ్ అడ్జెస్టిబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరు 300 మిమీ ఫ్రెంట్ డిస్క్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్​తో 270 ఎంఎం రేర్ డిస్క్, వెనుక భాగంలో 153 మిమీ డ్రమ్ బ్రేక్​తో బేస్ ట్రిమ్స్​లో సింగిల్-ఛానల్ ఏబిఎస్ ఆప్షన్​ను కూడా రాయల్​ ఎన్​ఫీల్డ్​ అందిస్తుంది.

కొత్త క్లాసిక్ 350 19-ఇంచ్​ ఫ్రెంట్, 18-ఇంచ్​ రేర్​ స్పోక్డ్ వీల్స్​తో కొనసాగుతుందని ఆశించవచ్చు. అయితే తయారీదారు అల్లాయ్ వీల్ వేరియంట్లను అప్డేట్​ చేయొచ్చు.

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర ఎంత ఉంటుంది?

ప్రస్తుతం రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 ధర రూ .1.93 లక్షల నుంచి రూ .2.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. తాజా మోడల్​తో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. హీరో మావ్రిక్ 440, హార్లీ డేవిడ్సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400, బెనెల్లీ ఇంపీరియల్ 400 వంటి బైక్స్​ 350-500 సిసి సెగ్మెంట్లో క్లాసిక్ 350కి గట్టిపోటీనిస్తున్నాయి.

మరి ఈ అప్డేటెడ్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 బైక్​ లవర్స్​ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తదుపరి వ్యాసం