Harley-Davidson X440: ఈ రోజు నుంచి హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బుకింగ్స్ షురూ.. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు..
Harley-Davidson X440: ప్రీమియం బైక్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ లేటెస్ట్ ఎంట్రీ ఎక్స్ 440 (Harley-Davidson X440) బుకింగ్స్ భారత్ లో జులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ ను హీరో మోటో కార్ప్ భాగస్వామ్యంతో హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తి చేస్తోంది.
Harley-Davidson X440: భారత్ లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ బుకింగ్స్ జులై 4వ తేదీ సాయంత్రం 4.40 నుంచి ప్రారంభమవుతున్నాయని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. ఈ బైక్ ను ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కానీ, దేశవ్యాప్తంగా ఉన్న హార్లీ డేవిడ్సన్ (Harley-Davidson) డీలర్ షిప్స్ వద్ద కానీ, కొన్ని ఎంపిక చేసిన హీరో మోటో కార్ప్ ఔట్ లెట్స్ లో కానీ టోకెన్ అమౌంట్ గా రూ. 5000 చెల్లించి, ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు.
Harley-Davidson X440 price: ధర ఎంతంటే?
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డెనిమ్ (Denim), వివిడ్ (Vivid), ఎస్ (S). ఈ మోడల్స్ ఇంట్రడక్టరీ ఎక్స్ షో రూమ్ ధరల విషయానికి వస్తే, డెనిమ్ వేరియంట్ ధర రూ. 2.29 లక్షలు, వివిడ్ వేరియంట్ ధర రూ. 2.49 లక్షలు, ఎస్ వేరియంట్ ధర రూ. 2.69 లక్షలుగా నిర్ధారించారు. బుక్ చేసుకున్నవారికి అక్టోబర్ నెల నుంచి ఈ బైక్ డెలివరీస్ ప్రారంభమవుతాయి. ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ ను ప్రత్యేకంగా భారతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ధర కూడా ఇప్పటివరకు వచ్చిన హార్లీ డేవిడ్సన్ బైక్స్ కన్నా తక్కువ.
Harley-Davidson X440 features: ఇంజన్, ఇతర ఫీచర్లు..
హార్లీ డేవిడ్సన్ ఇతర మోడల్స్ తరహా డిజైన్ లోనే ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 కూడా ఉంటుంది. రెట్రో లుక్, రౌండ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ డిజైన్ ఫ్యుయెల్ ట్యాంక్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉంటాయి. ఇందులో 398 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్, అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్ మొదలైనవి స్టాండర్డ్ ఫీచర్స్ గా ఉంటాయి. ఈ బైక్ ను రాజస్తాన్ లోని నీమ్రానాలో ఉన్న హీరో మోటో కార్ప్ గార్డెన్ ఫాక్టరీలో ఉత్పత్తి చేస్తున్నారు.