Suzuki Ertiga Cruise Hybrid : సుజుకీ ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్.. ఇదిగో!
20 February 2024, 13:45 IST
- Suzuki Ertiga Cruise Hybrid price : ఇండోనేషియాలో జరిగిన ఓ ఈవెంట్లో.. ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ని రివీల్ చేసింది సుజుకీ సంస్థ. కొత్త వెహికిల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సుజుకీ ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్.. ఇదిగో!
2024 Suzuki Ertiga Cruise Hybrid : 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో వేదికగా.. ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ని రివీల్ చేసింది సుజుకీ. ఇండోనేషియాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టాండర్డ్ ఎర్టిగా సరసన.. ఈ కొత్త వెహికిల్‌ని కూడా విక్రయిస్తుంది సుజుకీ. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సుజుకీ ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ విశేషాలు..
2024 ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్‌లో స్టైలిష్ ఫ్రెంట్- రేర్ బంపర్, సైడ్ బాడీ డికాలస్, షార్ట్ యాంటీనా, 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి. ఎక్స్టీరియర్కి డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ లభిస్తోంది. బ్లాక్ రూఫ్, రూఫ్ రెయిల్, ఫ్రెంట్- రేర్ బంపర్ స్కర్టింగ్స్, ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బంపర్ మౌంటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
రెండు కొత్త కలర్స్‌లో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. అవి.. కూల్ బ్లాక్, పర్ల్ వైట్ వింత్ కూల్ బ్లాక్.
ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ ఎంపీవీలో 1.5 లీటర్ కే15బీ స్మార్ట్ హైబ్రీడ్ ఇంజిన్ ఉంటుంది. ఇక ఈ ఇంజిన్.. 101.5 హెచ్‌పీ పవర్‌ని, 138 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 10ఏ బ్యాటరీ ప్యాక్ దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది. ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ పెరుగుతుందని సంస్థ చెప్పింది. ఇప్పటికే.. ఈ ఎంపీవీ.. 20 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తోంది.
Suzuki Ertiga Cruise Hybrid : ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ ఇంటీరియర్‌లో సెమీ డ్యూయెల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ కప్‌హోల్డర్స్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి.
డ్యూయెల్ ఫ్రెంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్పీ, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ యాంకర్ సీట్స్, క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్ వంటివి ఈ సుజుకీ వెహికిల్‌లో సేఫ్టీ ఫీచర్స్‌గా ఉన్నాయి.
సుజుకీ ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్- ధర ఎంతంటే..
Suzuki Ertiga Cruise Hybrid launch : సరికొత్త ఎర్టిగా క్రూజ్ హైబ్రీడ్ మేన్యువల్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర 288 మిలియన్ ఐడీఆర్గా ఉంది. ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 15.3 లక్షలు. ఇక ఆటోమెటిక్ వేరియంట్ ధర 301 మిలియన్ ఐడీఆర్గా ఉంది. అంటే సుమారు రూ. 16 లక్షలు.
అంతేకాకుండా.. ఈ వెహికిల్‌పై 8 ఏళ్లు లేద 1,60,000 కి.మీల బ్యాటరీ వారెంటీ కూడా ఇస్తోంది సుజుకీ.