తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : మిడిల్​ క్లాస్​ వారికి ఎంతో ఇష్టమైన ఎలక్ట్రిక్​ స్కూటర్​- ఇప్పుడు సరికొత్తగా..

Electric scooter : మిడిల్​ క్లాస్​ వారికి ఎంతో ఇష్టమైన ఎలక్ట్రిక్​ స్కూటర్​- ఇప్పుడు సరికొత్తగా..

Sharath Chitturi HT Telugu

06 December 2024, 6:40 IST

google News
    • బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొత్త వెర్షన్​ లాంచ్​కి రెడీ అవుతోంది. లాంచ్​ డేట్​తో పాటు ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో బజాజ్​ చేతక్​ ఒకటి. సేల్స్​ పరంగా అతి తక్కువ సమయంలో ఈ ఈ-స్కూటర్​ టాప్​-3 స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు బజాజ్ ఆటో.. చేతక్ నెక్ట్స్​ జనరేషన్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది. డిసెంబర్ 20, 2024 న కొత్త చేతక్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని విడుదల చేసేందుకు బజాజ్ ఆటో, మీడియా ఆహ్వానాన్ని పంచుకుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

2020 లో బజాజ్ చేతక్ ఈవీ మొదటిసారి వచ్చినప్పటి నుంచి దృశ్యపరంగా చాలావరకు అదే విధంగా ఉంది. అయినప్పటికీ కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త స్క్రీన్, ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్స్​, మెరుగైన హార్డ్​వేర్​ కలిగి ఉన్న దాని ఫీచర్ల జాబితాకు విస్తృతమైన అప్​గ్రేడ్స్​ చేసింది. తదుపరి తరం వెర్షన్ ఈ పారామీటర్లలో ప్రతిదానిపై అప్​డేట్స్​ పొందుతుందని అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుత చేతక్ సుమారు 21 లీటర్ల అండర్-సీట్ స్టోరేజీని అందిస్తుంది. ఇది సెగ్మెంట్​లోనే అతి తక్కువ! కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​పై సమాచారం లిమిటెడ్​గా ఉన్నప్పటికీ, తదుపరి తరం బజాజ్ చేతక్​ని కొత్తగా అభివృద్ధి చేసిన ఛాసిస్​పై అమర్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది గణనీయమైన మెరుగుదలలను తీసుకువస్తుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్​ను అందించే అవకాశం ఉంది. ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ తరహాలో ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఫ్లోర్ బోర్డు కింద బ్యాటరీని పెట్టొచ్చు.

బ్యాటరీ ప్యాక్​ని రీడిజైన్​ చేసే అవకాశం కూడా ఉంది. ఇది అందుబాటులో ఉన్న ఆప్షన్​లకు సమానమైన సామర్థ్యాన్ని ప్యాక్ చేసేటప్పుడు ఎక్కువ రేంజ్​ని అందించగలదు. ప్రస్తుత బజాజ్ చేతక్ వేరియంట్​ను బట్టి 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తోంది.

గుడ్​ లుక్స్​తో పాటు గుడ్​ పర్ఫార్మెన్స్​ ఇస్తోంది కాబట్టే, బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​కి మంచి ఆదరణ లభిస్తోంది. కొత వెర్షన్​లో కూడా ఇదే కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. కొత్త తరం బజాజ్ చేతక్ ధరలు ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరగొచ్చు. ప్రస్తుతం ఈ-స్కూటర్ ధర రూ.96,000 నుంచి రూ.1.29 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.

లాంచ్​ సమయానికి ఈ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటిని మేము మీకు అప్​డేట్​ చేస్తాను.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

తదుపరి వ్యాసం