YS Jagan to Kadapa: కడపలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్
23 December 2024, 12:21 IST
- YS Jagan to Kadapa: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ క్రిస్మస్ వేడుకల్ని పులివెందులలో జరుపుకోనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలోనే గడుపుతారు. బెంగుళూరు నుంచి నేరుగా కడప జిల్లాల ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు.
రేపు పులివెందులకు వైసీపీ అధ్యక్షుడుజగన్
YS Jagan to Kadapa: వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 24వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తారు. క్రిస్మస్ వేడుకల్ని కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జరుపుకుంటారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు బయలుదేరి వెళ్తారు.
24.12.2024 షెడ్యూల్
ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.
25.12.2024 షెడ్యూల్
ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు.
26.12.2024 షెడ్యూల్
పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు.
27.12.2024 షెడ్యూల్
ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు, అనంతరం బయలుదేరి బెంగళూరు బయల్దేరి వెళతారు.