తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Son: రాజారెడ్డి వివాహం.. జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి

YS Sharmila Son: రాజారెడ్డి వివాహం.. జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి

Sarath chandra.B HT Telugu

01 January 2024, 12:14 IST

google News
    • YS Sharmila Son: వైఎస్‌ షర్మిల, బ్రదర్ అనిల్‌ దంపతుల కుమారుడు రాజారెడ్డి  వివాహం ఖరారైంది. ఈ మేరకు ఎక్స్‌లో షర్మిల తేదీలను ప్రకటించారు. 
వైఎస్‌.రాజారెడ్డి, ప్రియా అట్లూరి
వైఎస్‌.రాజారెడ్డి, ప్రియా అట్లూరి

వైఎస్‌.రాజారెడ్డి, ప్రియా అట్లూరి

YS Sharmila Son: నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కుమారుడి వివాహ తేదీలను షర్మిల ప్రకటించారు. గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల-అనిల్ దంపతుల కుమారుడు రాజారెడ్డి వివాహ తేదీని కొత్త ఏడాది షర్మిల ప్రకటించారు.

2024 నూతన సంవత్సరంలో కుమారుడు YS రాజారెడ్డికి, అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం జరుగనున్నట్లు షర్మిల వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరుగనుందని తెలిపారు.

జనవరి 2వ తేదీన కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్‌ ఘాట్‌లో ఉంచి, తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నట్లు తెలిపారు.

వైఎస్‌ షర్మిల కుమారుడి నిశ్చితార్థం, వివాహ తేదీలు ఖరారైన నేపథ్యంలో మేనల్లుడి పెళ్లి కార్యక్రమాలకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా అన్న చెల్లెళ్ల మధ్య దూరం పెరిగినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఉంటుందనే ప్రచారం కూడా ఇటీవల మొదలైంది.

తదుపరి వ్యాసం