తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Vijayasai Reddy : పురంధేశ్వరి గారు... చంద్రబాబు అవినీతిలో మీ వాటా ఎంత..?

MP Vijayasai Reddy : పురంధేశ్వరి గారు... చంద్రబాబు అవినీతిలో మీ వాటా ఎంత..?

14 October 2023, 6:55 IST

google News
    • YCP MP Vijaya Sai Reddy: పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ  వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంతో చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.  చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి

ఎంపీ విజయసాయిరెడ్డి

YCP MP Vijaya Sai Reddy: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. చంద్రబాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ ఏదో ఒక డ్రామా చేస్తున్నారని…. అమిత్‌షా లోకేష్‌ను పిలిచినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ అడ్వొకేట్‌ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. పురంధేశ్వరిని ఎల్లో లోటస్‌గా అభివర్ణించిన విజయసాయిరెడ్డి …. రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆమె తప్పుడు ప్చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. గతంలో పురంధేశ్వరి భర్తే చంద్రబాబును అవినీతిపరుడన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.

“చంద్రబాబుకి 75 ఏళ్ల వయసులోనూ తిరుగులేని ఎనర్జీ ఉందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు నిన్నటి వరకూ ఊదరగొట్టారు. కానీ.. ఇప్పుడు ఆ ఎనర్జీ ఏమైందోగానీ.. తిరుగులేని అలెర్జీ మాత్రం వచ్చిందట. పురందేశ్వరి నిజాలు చెప్పాలి. చంద్రబాబు అవినీతిపరుడో కాదో అవునో చెప్పాలి. పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు… చంద్రబాబు అవినీతిపై పుస్తకం కూడా రాశారు. పురందేశ్వరి అసలు ఎంతకు అమ్ముడిపోయారు..? చంద్రబాబు మీకు ఎంత ఇచ్చారు…? మీ వాటా ఎంత…?” అని ప్రశ్నించారు.

"చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ లేదంటూ పురందేశ్వరి, లోకేశ్ బయటికి వచ్చి చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈ- పేపర్ లో బీజేపీనే చేసిందంటూ ఆర్టికల్ ప్రచురించారు. మోదీనే టార్గెట్ చేస్తూ రాసుకొచ్చారు. అయినా మా ప్రభుత్వ పరిధిలోని సీఐడీనే అరెస్ట్ చేసింది. కేంద్ర సంస్థలు కూడా చంద్రబాబు అవినీతిని ధ్రువీకరించటమే కాదు కేసులను కూడా నమోదు చేసింది" అని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

తప్పుడు ప్రచారం - సజ్జల

చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. కక్ష సాధింపు చర్యలు తమకు అలవాటు లేదన్నారు. చంద్రబాబు కేసులో ప్రభుత్వ జోక్యం లేదని… కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయని చెప్పారు.

తదుపరి వ్యాసం