Miyazaki Mango : కాకినాడలో మియాజాకీ మామిడి పండ్లండే.. బాబోయ్ రూ.2.5 లక్షల ధరండే
07 June 2022, 15:42 IST
- మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. మనకు తెలిసి వీటి ధర వందల్లోనే ఉంటుంది. కానీ లక్షల్లో ఉండే మామిడి పండ్లు ఉంటే.. అదికూడా మన తెలుగు రాష్ట్రంలో పండిస్తే..
మియాజాకీ
మామిడి పండు ఏటా.. ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ పండ్ల రుచిని.. ఎప్పుడు చుద్దామా.. అని మామిడి పండ్లంటే ఇష్టపడేవాళ్లు వేసవి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎన్నో రకాల మామిడి పండ్లు.. మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రుచితోపాటు.. మంచి పోషకాలు కూడా ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ మనకు వంద రూపాయలు పెడితే దొరికేవి.. కానీ జపాన్ లోని మియాజాకీ మామిడి పండ్లు మాత్రం కేజీ దర రూ.2.5 లక్షలు ఉంటుంది. నమ్మట్లేదా.. నిజమండి. అయితే ఈ పండు మన కాకినాడలోనూ ఓ రైతు పండిస్తున్నాడు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెబ్రోలుకు చెందిన నాగేశ్వరరావు మియాజాకీ రకం మామిడి పండ్లు పండిస్తున్నాడు. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ప్రపంచలోని చాలా రకలా మామిడి పండ్లను సాగు చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. జపాన్ కు చెందిన మియాజాకీ మామిడి పండ్లను కూడా సాగుచేస్తున్నారు. ఈ పండు ధర.. ప్రపంచ మార్కెట్లో రెండున్నర లక్షల రూపాయలు ఉంది. ఇందులో అనేక పోషకాలు ఉండటం కారణంగానే ధర ఎక్కువగా ఉంటుందని రైతు నాగేశ్వరరావు చెబుతున్నారు.
భారతదేశంలో బంగినపల్లి, కలెక్టర్ మామిడి, నీలవేణి, రసాలు, చెరకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణ , కొబ్బరి ఇలా రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఇవన్నీ మనం తిని.. ఆస్వాదిస్తాం. ఎందుకంటే.. మనకు అందుబాటు ధరలోనే దొరుకుతాయి. కానీ మియాజాకీ మామిడి ధర మాత్రం ప్రపంచంలోనే ఎక్కువ. ఇది భారతదేశానికి చెందిన పండు కాదు. జపాన్‌లోని మియాజాకీ నగరంలో విరివిగా సాగులో ఉన్న పండు ఇది. ఎగ్ ఆఫ్ సన్‌షైన్‌గా దీన్ని పిలుస్తుంటారు. జపాన్‌లో మాత్రమే ఉండే అరుదైన మామిడి పండు. దీని కిలో ధర రెండున్నర లక్షలుగా ఉంది.
ఈ మామిడికి ఎందుకంత ప్రత్యేకత అంటే... ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు సమస్య ఉన్న వారికి ఇవి బాగా మేలు చేస్తాయని చెబుతారు. దీనివల్ల కాన్సర్ రిస్క్ తగ్గుతుందని వైద్యులు అంటారు. జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, ఖె వంటి పోషకాలు మియాజాకి మామిడిలో దొరుకుతాయి. శరీరానికి అవసరమైన కాపర్, మెగ్నీషియాలను కూడా అందిస్తుంది.
జపాన్ ప్రజలకు మామిడి పండ్లంటే ఇష్టం ఎక్కువగా ఉంటుందట. కొన్నిసార్లు.. కొన్ని రకాల మామిడి పండ్లను ఏకంగా వేలం పాట నిర్వహిస్తారట. ఇలా లక్షల రూపాయలు వెచ్చించి కొనే మామిడి పండ్లలో మియాజాకీ ఉంటుంది. ఈ రకం పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల వరకు ఉంటుందట. వేలంలో కొన్నిసార్లు రూ.3 లక్షలకు కూడా పోతుందట. కాకినాడ రైతు నాగేశ్వరరావు.. వీటిని ఎగుమతి చేస్తారో.. లేదంటే.. ఇక్కడే కావాల్సిన వాళ్లకు అమ్ముతారో చూడాలి.
టాపిక్