తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : కెమెరా క్లిక్ మ‌నిపించిన సీఎం చంద్రబాబు, ఫొటోలు వైరల్

CM Chandrababu : కెమెరా క్లిక్ మ‌నిపించిన సీఎం చంద్రబాబు, ఫొటోలు వైరల్

HT Telugu Desk HT Telugu

19 August 2024, 16:55 IST

google News
    • CM Chandrababu : వరల్డ్ ఫొటోగ్రఫీ సందర్భంగా సీఎం చంద్రబాబు కెమెరా చేతబట్టి క్లిక్ మనిపించారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనను వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు కలిశారు. వారితో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.
కెమెరా క్లిక్ మ‌నిపించించిన సీఎం చంద్రబాబు, ఫొటోలు వైరల్
కెమెరా క్లిక్ మ‌నిపించించిన సీఎం చంద్రబాబు, ఫొటోలు వైరల్

కెమెరా క్లిక్ మ‌నిపించించిన సీఎం చంద్రబాబు, ఫొటోలు వైరల్

CM Chandrababu : ప్రపంచ‌ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు కెమెరా క్లిక్ మనిపించారు. నిరంతరం బిజీబిజీగా ఉండే చంద్రబాబు ఫొటోగ్రఫీపై ఉన్న మ‌క్కువ‌ను బ‌య‌ట‌పెట్టారు. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయ‌న‌ను వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫొటోలు క్లిక్ మనిపించారు.

మీడియాలో ఫొటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫొటోగ్రఫీ రంగం బాగుండాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఫొటో జ‌ర్నలిస్టుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు. వారంద‌రిని ఒక్కొక్కరిగా ప‌లికరించారు. అంద‌రిని ప‌రిచ‌యం చేసుకున్న త‌రువాత, వారితో స‌ర‌దాగా కాసేపు గ‌డిపారు. అనంత‌రం ఫొటో జ‌ర్నలిస్టుల గురించి అడిగిన తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు త‌మ‌తో సంతోషంగా గ‌డ‌ప‌డం ప‌ట్ల ఫొటో జ‌ర్నలిస్టులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

వాస్తవానికి సీఎం చంద్రబాబుకి సోమ‌వారం బిజీ షెడ్యూల్ ఉంది. తిరుప‌తి ప‌ర్యటనలో వివిధ కార్యక్రమాలు, పారిశ్రామిక వేత్తల‌తో స‌మావేశాలు, కంపెనీల ప్రారంభాలు ఉన్నాయి. అయిన‌ప్పటికీ సీఎం చంద్రబాబు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సంద‌ర్భంగా ఫొటో జర్నలిస్టుల‌తో క‌లిసి కాసేపు గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా ఫొటో జ‌ర్నలిస్టులు త‌మ స‌మ‌స్యల‌ను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం