తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crime : ఇష్టం లేని ముద్దు...! భర్త నాలుక కొరికేసిన భార్య

AP Crime : ఇష్టం లేని ముద్దు...! భర్త నాలుక కొరికేసిన భార్య

22 July 2023, 10:02 IST

google News
    • AP Crime News: కర్నూలులో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలని చూసిన భర్త నాలుకను కొరికి, గాయపరచింది భార్య.  ప్రస్తుతం భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
ముద్దు పెట్టాలని చూసిన భర్త.. నాలుక కొరికేసిన భార్య
ముద్దు పెట్టాలని చూసిన భర్త.. నాలుక కొరికేసిన భార్య (unsplash)

ముద్దు పెట్టాలని చూసిన భర్త.. నాలుక కొరికేసిన భార్య

AP Crime News: వారికి 2015లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా ఎలాంటి విబేధాలు లేకుండా బాగానే ఉంటున్నారు. కట్ చేస్తే గత రెండేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. అయితే భార్యకు ఇష్టం లేకున్నా ముద్దుపెట్టేందుకు యత్నించాడు భర్త. అగ్రహంతో ఊగిపోయిన భార్య... అతని నాలుకను కోరికేసింది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు చూస్తే... గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండానికి పుష్పవతిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతూ ఉన్నది. కానీ, రెండేళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత... భార్యను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇష్టం లేకుండా... బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో భార్య అతని నాలుకను బలంగా కొరికింది. దీంతో చంద్రానాయక్‌ నాలుక పైభాగంలో తీవ్ర గాయమైంది.

చికిత్స కోసం భర్త చంద్రానాయక్ ను గుత్తి హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు తారాచంద్‌కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు.

తదుపరి వ్యాసం