తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Weather Update South West Monsoon Enters In Rayalaseema

Weather Update : రాయలసీమలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

HT Telugu Desk HT Telugu

12 June 2022, 21:47 IST

    • నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.  ప్రస్తుతం కడప​, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైపు రుతుపవవాలు పయనిస్తున్నాయి. రాత్రి అక్కడక్కడ వర్షాలు, పిడుగులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం అటుఇటుగా నంద్యాల జిల్లాలోనూ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

మరోవైపు.. తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కుస్తున్నాయి.

ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు.. వాతావరణ శాఖ ఇప్పటికే చల్లటి కబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు.. జూన్ 13న ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇన్ని రోజులు ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజల కాస్త ఉపశమనం పొందనున్నారు.

సోమవారం నాడు తెలంగాణ, ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఇప్పటికే రాయలసీమను తాకాయి నైరుతి రుతుపవనాలు. శనివారం నాటికి గోవా, కొంకణ్‌, కర్ణాటక ప్రాంతాల్లో కొంతవరకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాలన్నింటా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఏపీల్లోకి ప్రవేశిస్తాయని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టుగా ఐఎండీ తెలిపింది.

విమానం మళ్లింపు.. అందులో కేంద్రమంత్రి

విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో విమానాల లాండింగ్ ఇబ్బంది ఎదురైంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని వాతావరణం అనుకూలించక హైదరాబాద్ కు మళ్లించారు. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి జయశంకర్ ఉన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో విశాఖ పుర ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.

టాపిక్