తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ai Airport Services Jobs: విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల్లో వాకిన్ సెలక్షన్ ఉద్యోగాలు…

AI Airport Services Jobs: విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల్లో వాకిన్ సెలక్షన్ ఉద్యోగాలు…

Sarath chandra.B HT Telugu

06 March 2024, 9:52 IST

google News
    • AI Airport Services Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఎఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు...
ఎఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు...

ఎఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు...

AI Airport Services Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ AI Airport Services ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం Visakhapatnam, విజయవాడ విమానాశ్రయాల్లోAirports పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగాల భర్తీతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా వెయిట్ లిస్ట్ జాబితాను రూపొందిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో కస్టమర్ సర్వీస్Customer Service Executive, జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ Handy Man, హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

విశాఖపట్నంల భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ ఆఫీసర్ ఖాళీలు ఐదు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 22, జూనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 14, హ్యాండీమాన్ ఉద్యోగాలు 36 ఉన్నాయి.

మార్చి9వ తేదీన జరిగే వాకిన్ సెలక్షన్‌లో అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకు ఈ సెలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలను మాత్రం మార్చి 11వ తేదీ ఉదయం 9.30 నుంచి 12.30 మధ్య ఎంపిక చేస్తారు.

అర్హతలు...

జూనియర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్టంగా 35ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేల్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడిట్, డిగ్రీ విద్యార్హతలతో 9ఏళ్ల పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ప్యాసింజర్ చెక్‌ ఇన్‌, కార్గో హ్యాండ్లింగ్‌లో అనుభవం ఉండాలి. నెలకు రూ.29.760 వేతనం చెల్లిస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పట్టు ఉండాలి. ఎంబిఏ విద్యార్హత కలిగిన వారికి ఏవియేషన్‌ రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్నా అనుమతిస్తారు. అభ్యర్థులు కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 10వ తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీలతో పాటు ఎయిర్‌లైన్‌, జిహెచ్‌ఏ, కార్గో, ఎయిర్‌లైన్‌ టికెటింగ్, ఎయిర్‌లైన్ డిప్లొమా, ఎయిర్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.24,960, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.21,270 వేతనం చెల్లిస్తారు.

హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ బాషను చదవగలిగి ఉండాలి. రూ.18,840 వేతనం చెల్లిస్తారు. నిర్దేశిత దరఖాస్తుతో పాటు విద్యార్హతలతో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రదేశం...

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిఎన్‌ఎస్‌ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్‌లో నిర్వహిస్తారు. ఓల్డ్ ఎయిర్‌ పోర్ట్ కార్గో టెర్మినల్‌లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది.

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌గా ఉండేది. దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి.

విజయవాడ విమానాశ్రయంలో మార్చి 16న....

విజయవాడ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2, హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలు 16వ భర్తీ చేస్తారు.మార్చి 16వ తేదీన విజయవాడ గన్నవరంలోని ఎయిర్‌ పోర్ట్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ ప్రాంగణంలో ఎంపికలు నిర్వహిస్తారు.

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రొడక్షన్, ఆటోమోబైల్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల్లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఐటిఐ విద్యార్హతతో పాటు ఎన్‌సిటివిటి శిక్షణ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. గరిష్ట వయసు 28ఏళ్లుగా నిర్ణయించారు. రూ.24,960 వేతనం చెల్లిస్తారు.

హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ బాషను చదవగలిగి ఉండాలి. రూ.18,840 వేతనం చెల్లిస్తారు. నిర్దేశిత దరఖాస్తుతో పాటు విద్యార్హతలతో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌లలో ఉద్యోగాల నోటిఫికేషన్లను దిగువన చూడొచ్చు. https://www.aiasl.in/Recruitment లో కూడా నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.

తదుపరి వ్యాసం