AU Degree Results : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి!
27 May 2024, 20:08 IST
- AU Degree Results : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 99.57 శాతం పాస్ అయ్యారు. కేవలం 120 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు.
ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోండి!
AU Degree Results : ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో 99.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సోమవారం ఏయూ పరీక్షల విభాగ డీన్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 2021-24 బ్యాచ్ డిగ్రీ తుది పరీక్షల (ఆరో సెమిస్టర్) ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. పరీక్షల ఫలితాలను విద్యార్థలు ఆంధ్ర యూనివర్సిటీ వెబ్‌సైట్ https://aucoeonline.com/Student_Results.aspx లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ లో మొత్తం 27,603 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 27,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
పలు విభాగాల్లో 100 శాతం ఉత్తీర్ణత
బీఏ (సీబీసీఏస్)లో 99.68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీకాం (జనరల్)లో 99.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, బీకాం (కంప్యూటర్స్)లో 99.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీలో 99.52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారు. బీబీఏ (సీబీసీఏస్)లో 98.66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీ ఫుడ్ సైన్స్‌లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీలో కూడా 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ విభాగంలో 100 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. బీహెచ్ఏంసీటీలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
కేవలం 120 మంది ఫెయిల్
డిగ్రీ ఫలితాల్లో కేవలం 120 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారని ఏయూ పరీక్షల విభాగ డీన్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి తెలిపారు. డిగ్రీ చివరి ఆరో సెమిస్టర్ పరీక్షలు మొత్తం 27,603 మంది రాశారు. అందులో 27,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, కేవలం 120 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. 2021-24 డిగ్రీ కోర్సుల్లో టాపర్స్ జాబితా కోసం ఈ లింక్ https://aucoeonline.com/ToppersList.aspx లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ పాలిసెట్ - 2024 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ నుంచి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే మే 26వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు jtsecy-sbtet@telangana.gov.in మెయిల్ అడ్రస్ కు వివరాలను పంపాల్సి ఉంటుంది.
పాలిసెట్ ప్రిలిమినరీ కీ విడుదల
- తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Provisional Key అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ప్రాథమిక కీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టీఎస్ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే…?
తెలంగాణ పాలిసెట్ పరీక్షను మే 24వ తేదీన నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రకారం చూస్తే…. జూన్ మొదటి వారంలో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే… తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు