తెలుగు న్యూస్ / ఫోటో /
Medak : హెడ్ మాస్టర్ వినూత్న ఆలోచన, సెలవుల్లో వీధి గోడలపై చదువు నేర్చుకుంటున్న విద్యార్థులు
- Medak : వేసవి సెలవులలో పిల్లలు వర్ణమాలలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.

(1 / 6)
వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు ఆటల్లో మునిగి తేలుతుంటారు. దీంతో సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన చదువును పూర్తిగా మర్చిపోతుంటారు. ఈ క్రమంలో పాఠశాల తెరిచిన అనంతరం మరల మొదటి నుంచి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వేసవి సెలవులలో పిల్లలు మర్చిపోకుండా ఉండేందుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లబాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వల్లబాపూర్ గ్రామంలో గోడలపై తన సొంత నిధులతో ఇలా తెలుగు వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ఇంగ్లిష్ వర్ణమాల, అంకెలు రాయించారు.
(2 / 6)
వల్లబాపుర్ గ్రామంలో పలుచోట్ల ఇంటి యజమానులను ఒప్పించి గోడలపై తెలుగు వర్ణమాల,గుణింతాలు రాయించారు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి. వీధులలో పిల్లలు ఆడుకుంటూ, విశ్రాంతి తీసుకునే సమయాలలో చదుకుంటున్నారని తెలిపారు.
(3 / 6)
గోడలపై పెయింటింగ్ రూపంలో రాయడం వలన పిల్లలు ఆడుకునే సమయంలో వాటిని చదవడంతో కొంతయినా గుర్తుంటుందని హెచ్ మాస్టర్ పరమేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
(4 / 6)
అక్షరమాల, నెంబర్లు గోడలపై కనిపించడం వలన పిల్లలు బాగా చదువుతున్నారని హెడ్ మాస్టర్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి ఆలోచనతో గోడలపై అక్షరాలు రాయడం పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థుల తల్లితండ్రులు అంటున్నారు.
ఇతర గ్యాలరీలు