TS POLYCET Results 2024 : తెలంగాణ పాలిసెట్ 'కీ' విడుదల - లింక్ ఇదే, ఫలితాలు ఎప్పుడంటే...?
TS POLYCET Answer Key 2024: తెలంగాణ పాలిసెట్ - 2024 ప్రాథమిక కీ విడుదలైంది. త్వరలోనే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
TS POLYCET Results 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ నుంచి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే మే 26వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు jtsecy-sbtet@telangana.gov.in మెయిల్ అడ్రస్ కు వివరాలను పంపాల్సి ఉంటుంది.
TS POLYCET Key 2024 Download: పాలిసెట్ ప్రిలిమినరీ కీ విడుదల
- తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Provisional Key అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ప్రాథమిక కీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
TS POLYCET Results 2024 : టీఎస్ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే…?
తెలంగాణ పాలిసెట్ పరీక్షను మే 24వ తేదీన నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రకారం చూస్తే…. జూన్ మొదటి వారంలో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే… తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పాలిసెట్ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి. polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :
Telangana POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా…. జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.
జూలై 23వ తేదీన స్పాట్ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఇవాళ(మే 24) రాష్టవ్యాప్తంగా జరిగింది. ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది.