TS POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ అప్డేట్స్ - జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం..! ఇదిగో పూర్తి షెడ్యూల్-telangana polycet counselling 2024 start from 20 june check key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Polycet Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ అప్డేట్స్ - జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం..! ఇదిగో పూర్తి షెడ్యూల్

TS POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ అప్డేట్స్ - జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం..! ఇదిగో పూర్తి షెడ్యూల్

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2024 05:05 PM IST

TS POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జూన్ 20వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2024
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2024

Telangana POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.

జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా…. జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

జూలై 23వ తేదీన స్పాట్‌ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఇవాళ(మే 24) రాష్టవ్యాప్తంగా జరిగింది. ఇందుకోసం మొత్తం 259 ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

ఈ పరీక్ష ద్వారా…. పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

TS Polycet Results 2024: తెలంగాణ పాలిసెట్ - 2024 ఫలితాలు ఎప్పుడంటే…?

తెలంగాణ పాలిసెట్ పరీక్ష మే 24వ తేదీన జరిగింది. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జూన్ మొదటి వారంలో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పాలిసెట్‌ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి. polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీలో పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం….

AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు తదితర ఆన్ లైన్ ప్రక్రియకు మే 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం కల్పించారు.

ధృవపత్రాల వెరిఫికేషన్ కు మే 27 నుండి జూన్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజుల గడువు ఉంది. విద్యార్ధులు కోరుకున్న కోర్సులతో పాటు కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లను నమోదు చేయడానికి మే 31వ తదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 5వ తేదీన విద్యార్ధులు తాము ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోడానికి అవకాశం ఉంటుందని , జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వివరించారు.

జూన్ పదవ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు అయా పాలిటెక్నిక్ కాలేజీలలో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలో రిపోర్టు చేయవలసి ఉంటుంది. జూన్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం