AP SET 2024 Registration : రేపటితో ముగియనున్న ఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ, పూర్తి వివరాలు ఇలా?
05 March 2024, 16:51 IST
- AP SET 2024 Registration : ఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఏపీ సెట్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ
AP SET 2024 Registration : ఏపీ సెట్ 2024 దరఖాస్తు(AP SET Applications) ప్రక్రియ రేపటితో(మార్చి 6) ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు apset.net.in అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడానికి రేపే చివరి తేదీ. అయితే అభ్యర్థులు రూ.2000 ఆలస్య రుసుముతో 2024 మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్లను(AP SET Hall Tickets) ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. ఏప్రిల్ 28న ఏపీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ సెట్ 2024 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ సెట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి?
Step 1 : ఏపీ సెట్ అధికారిక వెబ్ సైట్ apset.net.in ను సందర్శించండి.
Step 2 : హోమ్ పేజీలోని ఏపీ సెట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4 : తర్వాత అప్లై పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
Step 5 : ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ నింపి ఫీజు చెల్లించాలి.
Step 6 : సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఏపీ సెట్ ఫీజు వివరాలు
ఏపీ సెట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. తమ దరఖాస్తును ఆన్‌లైన్(Online Applications) లో సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1200, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 700 అప్లికేషన్ ఫీజు చెల్లించారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. సిలబస్, అర్హత, పరీక్షా కేంద్రాలు, ఇతర సమాచారం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమాచారం కోసం www.andhrauniversity.edu.in, apset.net.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
పరీక్ష విధానం
ఏపీ సెట్(AP SET 2024) ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది. సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
గరిష్ట వయోపరిమితి లేదు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అధ్యాపకుల నియామకాల్లో సెట్(SET) స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు. జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి ఏడాది పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు, వయసు, అర్హత ప్రమాణాలలో సడలింపును పొందేందుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టులోని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ కేటగిరీలలో ఈ వర్గానికి సంబంధించిన సబ్జెక్ట్ వారీగా కట్-ఆఫ్‌లు ఉండాలి. ఏపీ సెట్ పరీక్షకు అర్హత కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు. సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.