AP SET 2024 : ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలివే!-visakhapatnam news in telugu andhra university released ap set 2024 notification important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Set 2024 : ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలివే!

AP SET 2024 : ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలివే!

Bandaru Satyaprasad HT Telugu
Feb 10, 2024 06:59 PM IST

AP SET 2024 : ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఏపీ సెట్ ను ఆంధ్ర యూనివర్సిటీ సెట్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 14 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి.

ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల (Pexels)

AP SET 2024 : ఏపీ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP SET-2024) నోటిఫికేషన్‌ విడుదలైంది. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్‌ పరీక్షను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 14 నుంచి ఏపీ సెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మార్చి 6 అప్లికేషన్లకు చివర తేదీ. ఏప్రిల్ 28న ఏపీ సెట్ పరీక్షను నిర్వహంచనున్నారు. జనరల్‌ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

గరిష్ట వయోపరిమితి లేదు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అధ్యాపకుల నియామకాల్లో సెట్(SET) స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు. జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి ఏడాది పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు, వయసు, అర్హత ప్రమాణాలలో సడలింపును పొందేందుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టులోని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ కేటగిరీలలో ఈ వర్గానికి సంబంధించిన సబ్జెక్ట్ వారీగా కట్-ఆఫ్‌లు ఉండాలి. ఏపీ సెట్ పరీక్షకు అర్హత కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు. సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మ

ఏపీ సెట్ ఫీజు వివరాలు

ఏపీ సెట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. తమ దరఖాస్తును ఆన్‌లైన్(Online Applications) లో సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1200, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 700 అప్లికేషన్ ఫీజు చెల్లించారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. సిలబస్, అర్హత, పరీక్షా కేంద్రాలు, ఇతర సమాచారం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమాచారం కోసం www.andhrauniversity.edu.in, apset.net.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

పరీక్ష విధానం

ఏపీ సెట్(AP SET 2024) ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది. సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం