Ignou MBA Course : ఇగ్నోలో ఎంబీఏ, ఎంఏ కొత్త కోర్సులు- దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే
02 July 2024, 19:19 IST
- Ignou MBA Course : ఇగ్నో విజయవాడ క్యాంపస్ లో కొత్తగా నాలుగు ఎంబీఏ, ఒక పీజీ ఎంపీ కోర్సు ప్రారంభించారు. జులై 15లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇగ్నోలో ఎంబీఏ, ఎంఏ కొత్త కోర్సులు- దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే
Ignou MBA Course : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) విజయవాడ క్యాంపస్‌లో కొత్తగా ఎంబీఏ, పీజీ ఎంఏ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. నాలుగు ఎంబీఏ కోర్సులు, ఒక పీజీ ఎంఏ కోర్సు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు ఇగ్నో రీజనల్ సెంటర్ సీనియర్ రీజనల్ డైరెక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
అందుబాటులో ఏఏ కోర్సులు ?
ఇగ్నో జులై-2024 నుంచి ఎంబీఏలో కొత్త కోర్సులను అందిస్తుంది. అందులో భాగంగానే ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లయి చైన్ మేనేజ్ మెంట్, ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్ మెంట్ కోర్సులను ప్రారంభించింది. ఈ ఏడాది నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. అలాగే పీజీలోని ఎంఏలో భగవద్గీత అధ్యయనం కోర్సు కూడా ప్రారంభించింది.
ఫీజులు ఎలా?
ఈ నాలుగు కోర్సులు సెమిస్టర్ విధానంలో జరుగుతాయి. ఒక్కో సెమిస్టర్ ఫీజు రూ.15,500 నుండి రూ. 19,500 వరకు ఉంటుంది. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఇగ్నో ప్రవేశాలకు చివరి తేదీ జులై 15 అని డాక్టర్ శర్మ తెలిపారు. ఇతర వివరాలకు కోసం విజయవాడలోని కొత్తపేటలో ఎస్‌కేపీవీ హిందూ హైస్కూల్ క్యాంపస్‌లోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని కానీ, 0866-2565253 ఫోన్ నంబర్‌కు గానీ ప్రయత్నించవచ్చు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
ఈ కోర్సులకు సంబంధించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌లో https://ignouadmission.samarth.edu.in చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర ప్రొసెసింగ్ ఫీజు రూ.500 ఉంటుంది. అలాగే సెమిస్టర్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులన్నీ ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
దరఖాస్తు ఇలా చేయాలి
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థలు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట లింక్ https://ignouadmission.samarth.edu.in/ పై క్లిక్ చేయాలి. అప్పుడు వెబ్‌సైట్ అప్లికేషన్ దాఖలు చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కొత్త రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండనే బాక్స్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు అందులో అడిగిన వివరాలు ఇవ్వాలి.
ఇగ్నో జులై-2024 అడ్మిషన్లకు సంబంధించి డిసెంబర్‌లో మొదటి సెమిస్టర్ ఉంటుంది. అంటే సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఎగ్జామ్ ఫీజు చెల్లించడం, అలాగే అసెన్‌మెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రెండో సెమిస్టర్ ఫీజు జనవరిలో ఉంటుంది. దాదాపు మేలో రెండో సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. అంటే మార్చి-ఏప్రిల్ నెలల్లో రెండో సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు