IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..-ignou july 2024 session re registration begins at onlinerrignouacin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ignou July 2024 Session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
May 04, 2024 06:56 PM IST

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జూలై 2024 సెషన్లో ప్రవేశానికి రీ-రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. ఔత్సాహిక అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్ సైట్ onlinerr.ignou.ac.in ద్వారా జూన్ 30, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇగ్నో లో రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్
ఇగ్నో లో రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూలై 2024 సెషన్లో ప్రవేశానికి అధికారిక వెబ్ సైట్ onlinerr.ignou.ac.in లో రీ-రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. ఇగ్నో నోటిఫికేషన్ ప్రకారం, ఆసక్తి కలిగిన భారతీయ, అంతర్జాతీయ విద్యార్థులు జులై 2024 సెషన్ లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 30, 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తమ కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలని, ముఖ్యంగా ఆప్షన్లు ఇచ్చిన చోట, అందించే కోర్సుల వివరాల కోసం ప్రోగ్రామ్ గైడ్ చదవాలని ఇగ్నో (IGNOU) విద్యార్థులకు సూచించింది. ఔత్సాహిక అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు ప్రవేశానికి సంబంధించి ధృవీకరణ, ఇతర ముఖ్యమైన అప్ డేట్స్ ను యూనివర్సిటీ నుంచి పొందడానికి వారు తమ మొబైల్ నంబర్ ను, ఇ-మెయిల్ ఐడీని అందించాలి.

yearly horoscope entry point

రీ రిజిస్ట్రేషన్ కోసం..

ఒకవేళ విద్యార్థులు ఇప్పటికే పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని ఉన్నట్లయితే, వారు onlinerr.ignou.ac.in వెబ్ సైట్ లో లాగిన్ కావడానికి తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోని వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే (ఓటీపీ రాకపోవడం/ యూజర్ నేమ్/ పాస్వర్డ్ మర్చిపోవడం లేదా మరేదైనా ఇబ్బంది ఉంటే), ఖాతాను తిరిగి సెట్ చేయడం / ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ ను అప్డేట్ చేయడం కోసం ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదించాలి.

ఇగ్నో జూలై 2024 సెషన్ కు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

  • ఇగ్నో అధికారిక వెబ్ సైట్ onlinerr.ignou.ac.in ను ఓపెన్ చేయండి.
  • మొదట, షరతులను అంగీకరించడానికి బటన్ ను ప్రెస్ చేయండి
  • తరువాత, రీ-రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేయండి
  • మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే ఎన్ రోల్ మెంట్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా వంటి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి.
  • అప్లికేషన్ ఫారం నింపండి. అప్లికేషన్ ఫామ్ ను సేవ్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫారాన్ని ప్రింట్ చేయండి.
  • ఒకవేళ మీరు చేసిన ఆన్లైన్ పేమెంట్ అప్ డేట్ కాకపోతే వెంటనే రెండో పేమెంట్ చేయకండి. ఒక రోజు వేచి ఉండండి. ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.