తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chennai Vande Bharat: వందేభారత్‌ చెన్నై వయా గూడూరు, రేణిగుంట, తిరువళ్లూరు

Chennai Vande Bharat: వందేభారత్‌ చెన్నై వయా గూడూరు, రేణిగుంట, తిరువళ్లూరు

HT Telugu Desk HT Telugu

22 September 2023, 7:30 IST

google News
    • Chennai Vande Bharat:  విజయవాడ-చెన్నై వందే భారత్‌ రైలును గూడూరు నుంచి  రేణిగుంట మార్గంలో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుత మార్గంలో నడపడం కంటే రేణిగుంట మార్గంలో తిరుపతి వెళ్లే వారికి అనువుగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. 
ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభం
ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభం

ఈ నెల 24న 9 వందేభారత్‌ రైళ్ల ప్రారంభం

Chennai Vande Bharat: విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు ప్రయాణించే రూట్‌ ఫిక్స్‌ అయ్యింది. ఇప్పటి వరకు గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు మీదుగా సుళ్లూరు పేట వైపు ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా చెన్నైకు వెళతాయి.

వందే భారత్‌ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలును శ్రీకాళహస్తి, రేణిగుంట మార్గంలో నడుపుతున్నట్లు తెలిపారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఈనెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది. కొత్త రైళ్లలో దాదాపు 25 రకాల మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వందేభారత్‌ రైళ్లన్నింటిలో కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎనిమిదిన్నర గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సీట్లలో ఎనిమిదిన్నర గంటలపాటు కూర్చోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

సీట్లు వెనక్కి వాలే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణంలో మరింత వెనక్కి వాలి నిద్రపోయేలా పుష్‌బ్యాక్‌‌ సదుపాయంతో పాటు, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ను, ఫుట్‌రెస్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

మరుగుదొడ్లలో వెలుతురు, వెంటిలేషన్ సదుపాయాలు అభివృద్ధి చేశారు. వాష్‌బేసిన్ల సైజు పెంచారు. సీట్లలో కూర్చునే వారికి ఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో మార్పులు చేశారు. ఏసీ అడ్జస్ట్‌మెంట్‌ సదుపాయాలు కల్పించారు. మరోవైపు కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఈ రైలు రాత్రి తిరిగొచ్చింది.

తదుపరి వ్యాసం