తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Ugadi Calendar : శ్రీవారి భక్తులకు అలర్ట్... తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ - ఇలా కొనొచ్చు

TTD Ugadi Calendar : శ్రీవారి భక్తులకు అలర్ట్... తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ - ఇలా కొనొచ్చు

06 April 2024, 10:15 IST

    • TTD Ugadi Telugu Calendar: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్లను ప్రచురించింది. వీటిని వారం రోజుల్లో అందబాటులోకి తీసుకురానుంది.
తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ
తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ (TTD )

తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ

TTD Ugadi Telugu Calendar 2024: ఈ ఉగాది సందర్భంగా… శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ చరిత్రలోనే మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను(TTD Ugadi Telugu Calendar) ప్రచురించింది. వచ్చే వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయని ఆలయ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. టీటీడీ సమాచార కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

తిరుపతి టీటీడీ (TTD)పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ⁠ ⁠శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టిటిడి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ⁠ ⁠ఏప్రిల్‌ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు.

⁠ ⁠శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని(Sri kodri nama samvatsara panchangam) భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచామని చెప్పారు ధర్మారెడ్డి. ⁠ ⁠హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 5న తిరుమలలో శ్రీ అన్నమయ్య 521వ వర్థంతి కార్యక్రమం నిర్వహించున్నామని తెలిపారు.

ఏప్రిల్‌ 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. ⁠ ⁠ఈ నెల 21 నుండి 23వ తేది వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ⁠ ⁠ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు :

తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని(Vontimitta Kodandarama Swamy Temple) శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ⁠ఏప్రిల్‌ 22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ⁠ ⁠

ప్రతి సంవత్సరం మాదిరిగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాగాన్ని(Krodhinama Panchangam 2024) టీటీడీ ముద్రించింది. మార్చి 27వ తేదీ నుంచి తిరుమలతో పాటు తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో వీటిని కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.  రూ.75 చెల్లించి భక్తులు వీటిని పొందవచ్చు.

తదుపరి వ్యాసం