TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఆరోగ్యశ్రీతో స్విమ్స్‌లో ఉచిత వైద్యం- టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Board Decisions : సీఎం జగన్ పై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగింపుతో పాటు సొసైటీ, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలపై పెంపు వంటి కీలక నిర్ణయాలకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది.
TTD Board Decisions : సీఎం జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting)సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వివరించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రూ.4 కోట్లతో మంగళసూత్రాలు తయారీ
నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల(Tirumala) పెద్ద జీయర్‌స్వామి అనుమతితో ద్వారపాలకులు జయవిజయలకు బంగారు తాపడం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. రూ.4 కోట్లతో మంగళసూత్రల తయారీకి నాలుగు ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్లకు అప్పగించనున్నారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగుల స్థలానికి రూ.8.16 కోట్లు కేటాయించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవాతి ఆలయాని విద్యుత్ అలంకరణలకు బోర్డు ఆమోదం తెలిపింది. కార్పొరేషన్‌లోని అటవీశాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంచాలని నిర్ణయించారు. పాదిరేడులోని ఉద్యోగుల ఇంటి స్థలాల లేఅవుట్ అభివృద్ధికి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయించారు. రూ.3.15 కోట్లతో తిరుమలలో పలుచోట్ల కొత్త మోటార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో ఎఫ్.ఎం.ఎస్ సేవలకు మరో మూడేళ్లు పొడిగించాలని నిర్ణయించారు.
ఉద్యోగులకు రూ.10కే భోజనం
గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత, అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు బోర్డు అనుమతి తెలిపారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో లడ్డు తయారికీ సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు రూ.3.18 కోట్లు కేటాయించనున్నారు.1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. స్విమ్స్(SVIMS)లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం అందించాలని పాలక మండలి నిర్ణయించింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం అందించాలని నిర్ణయించింది.
సంబంధిత కథనం