తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : విశాఖ - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు -14 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

Special Trains : విశాఖ - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు -14 రైళ్లకు అద‌న‌పు కోచ్ లు

HT Telugu Desk HT Telugu

09 October 2024, 17:22 IST

google News
    • ప్రయాణికులకు రైల్వేశాఖ మరో అలర్ట్ ఇచ్చింది. విశాఖపట్నం - శ్రీకాకుళం రోడ్డు మధ్య రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని సమకూర్చినట్లు వాల్తేర్ డివిజ‌న్ అధికారులు వెల్లడించింది.
ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు.
ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

దసరా పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా విజ‌య‌న‌గ‌రం పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవ్ ను దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం - శ్రీకాకుళం రోడ్ - విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. అలాగే 14 రైళ్ల‌కు జ‌న‌ర‌ల్‌, స్లీప‌ర్ కోచ్‌ల‌ను పెంచుతున్న‌ట్లు తెలిపారు.

  1. విశాఖపట్నం - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08529) రైలు అక్టోబ‌ర్ 10 నుండి అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి ఉద‌యం 10:00 గంటలకు బయలుదేరుతుంది. మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. మొత్తం ఏడు ట్రిప్పులు న‌డుస్తుంది.
  2. శ్రీకాకుళం రోడ్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08530) రైలు అక్టోబ‌ర్ 10 నుండి అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌లో మ‌ధ్యాహ్నం 1ః30గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. సాయంత్ర 3:55 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. మొత్తం ఏడు ట్రిప్పులు న‌డుస్తుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరులో ఆగుతుంది. ఈ రైళ్లకు 8 మోము కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె.సందీప్‌ కోరారు.

14 రైళ్ల‌కు జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంపు

పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 14 రైళ్లకు అదనపు కోచ్‌లు పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.

1. విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ స్పెషల్ (08546) రైలుకు అక్టోబ‌ర్ 9 నుండి 16 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

2. కోరాపుట్ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08545) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 17 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

3. విశాఖపట్నం-భవానీపట్న ప్యాసింజర్ స్పెషల్ (08504) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 17 వ‌ర‌కు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

4. భవానీపట్న - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08503) రైలుకు అక్టోబ‌ర్ 11 నుండి 18 వ‌ర‌కు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

5. రూర్కెలా-గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలుకు అక్టోబ‌ర్ 9 నుండి 15 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచుతారు.

6. గుణుపూర్ - రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 16 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్‌ కోచ్ పెంచుతారు.

7. రూర్కెలా-జగ్దల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18107) రైలుకు అక్టోబ‌ర్ 9 నుండి 14 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్‌ కోచ్ పెంచుతారు.

8. జగదల్‌పూర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18108) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 15 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్‌ కోచ్ పెంచుతారు.

9. భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 16 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్‌ కోచ్ పెంచుతారు.

10. జగదల్పూర్ - భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలుకు అక్టోబ‌ర్ 11 నుండి 17 వ‌ర‌కు ఒక స్లీప‌ర్ క్లాస్‌ కోచ్ పెంచుతారు.

11. విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ప్యాసింజర్ స్పెషల్ (08532) రైలుకు అక్టోబ‌ర్ 9 నుండి 16 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

12. బ్రహ్మపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531) రైలుకు అక్టోబ‌ర్ 10 నుండి 17 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

13. విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ స్పెషల్ (08528) రైలుకు అక్టోబ‌ర్ 11 నుండి 17 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు.

14. రాయ్‌పూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08527) రైలుకు అక్టోబ‌ర్ 12 నుండి 18 వ‌ర‌కు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ పెంచుతారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం