Railways UPI Payments : వాల్తేర్ డివిజ‌న్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు, 66 రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు-visakhapatnam waltair division 66 railway stations upi qr code payments implemented ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Railways Upi Payments : వాల్తేర్ డివిజ‌న్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు, 66 రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు

Railways UPI Payments : వాల్తేర్ డివిజ‌న్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు, 66 రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు

Aug 10, 2024, 09:31 PM IST HT Telugu Desk
Aug 10, 2024, 09:31 PM , IST

  • Railways UPI Payments : వాల్తేర్ డివిజన్‌లో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఇత‌ర యూపీఐ యాప్‌లను ఉపయోగించి సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.

వాల్తేర్ డివిజన్‌లో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

(1 / 7)

డిజిటల్ ఇండియాలో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్ డివిజన్ 66 స్టేషన్‌లకు క్యూఆర్ (QR) కోడ్ టికెటింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇక్కడ ప్రయాణికులు వివిధ డిజిటల్ పేమెంట్ మాడ్యూల్స్‌లో చెల్లింపులు చేయవచ్చు.

(2 / 7)

ఇండియ‌న్ రైల్వే క్యూఆర్ (QR) కోడ్‌లను ఉపయోగించి కొత్త చెల్లింపు విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా ప్రయాణికులు ఇప్పుడు వారి ఫోన్‌లతో ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. ప్రయాణికులు ఇప్పుడు వాల్తేర్‌ డివిజన్‌లోని రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేసే అవకాశం ఉంటుంది.

(3 / 7)

ఈ ఫీచర్ టిక్కెట్ కౌంటర్లలో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఇత‌ర  యూపీఐ యాప్‌లను ఉపయోగించి సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు. రైల్లే స్టేషన్‌లలో క్యూఆర్ (QR) కోడ్ అందుబాటులో ఉండటంతో, ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా వారి పేపర్‌లెస్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీంతో సమయం, ఎనర్జీ ఆదా అవుతుంది.

(4 / 7)

ఈ సదుపాయంతో చివరి నిమిషంలో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకునే ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. యూటీఎస్ యాప్ ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే సేవలను డిజిటలైజేషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఈస్టు కోస్తా రైల్వే అమలు చేసిన ప్రధాన డిజిటల్ మార్గాలలో ఒకటి.

(5 / 7)

టిక్కెట్ కౌంటర్‌లకే కాకుండా పార్కింగ్, ఫుడ్ కౌంటర్‌లలో క్యూఆర్ కోడ్ నిబంధనలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు త‌మ లావాదేవీలను సజావుగా పూర్తి చేయవచ్చు. 

(6 / 7)

టిక్కెట్లు లేకుండా దొరికిన ప్రయాణికులు జరిమానా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో తక్షణమే చెల్లించవచ్చు. రైల్వే సిబ్బంది క్యూఆర్ కోడ్ స్కానర్‌లతో కూడిన హ్యాండ్‌హెల్డ్ టెర్మినల్ మెషీన్‌లను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రయాణికులు జరిమానాలను వెంటనే పరిష్కరించడానికి పరికరాన్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంద‌ని వాల్తేర్ డివిజ‌న‌ల్  కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు