తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rs1.2cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..

Rs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..

23 December 2024, 5:41 IST

google News
    • Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల భోజనాలకు  అక్షరాలా రూ1.2కోట్ల రుపాయలు చెల్లిచారు. సచివాలయంలో రెండ్రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు మంత్రులకు భోజనాలకు రూ1.2కోట్లను చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. 
కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజన ఖర్చు రూ.2కోట్లు?
కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజన ఖర్చు రూ.2కోట్లు?

కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజన ఖర్చు రూ.2కోట్లు?

Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్‌‌లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భోజన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు చర్చనీయాంశంగా మారింది. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌కు రెండ్రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ భోజనాల సరఫరా బాధ్యత అప్పగించారు. రోజుకు  రూ.60లక్షల చొప్పున మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్‌ కోసం చెల్లించినట్టు సమాచారం. 

ఏపీలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖలో అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్‌ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కలుపుకుని మొత్తం 250-300మందిలోపు సదస్సుకు హాజరయ్యరు. వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్‌ సిబ్బంది కూడా రెండ్రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరిని కలుపుకున్నా సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి 1200కు మించరు.

అధికారులు, మంత్రుల సహాయ సిబ్బందికి ప్రత్యేకంగా ఎలాంటి భోజన ఏర్పాట్లు చేయలేదు. మీడియాకు ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది రెండు రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు. తాజాగా ఒక్కో రోజు భోజనాలకు రూ.కోటి రుపాయలు చెల్లించినట్టు బయటకు పొక్కింది. భోజనాల సరఫరా కాంట్రాక్టును విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటల్‌కు అప్పగించడంతో 7 స్టార్‌ హోటల్‌ రేట్లకు మించి బిల్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

అధికారులకు అందించిన ఆహారం నాణ్యత సంగతి తెలియకున్నా, మీడియాకు అందించిన భోజనాలను ఒక్కో ప్లేట్‌ రూ.3200 ఖరీదుతో అందించినట్టు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశాలు జరిగిన సమయంలోనే అంతా అవాక్కయ్యారు. నాసిరకం భోజనాలకు ప్లేట్‌కు రూ.3200చెల్లించడం ఏమిటని చర్చ జరిగింది. తాజాగా రెండు రోజుల సమావేశాలకు రూ.1.2కోట్లు చెల్లించడం ఔరా అనిపిస్తోంది. 

తదుపరి వ్యాసం