తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd: శ్రీవారి భక్తులకు అలర్ట్… ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్… ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

HT Telugu Desk HT Telugu

06 July 2022, 11:29 IST

google News
    • శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

సెప్టెంబర్ నెలకు సంబంధించి...

ttd special darshan tickets for september 2022: మరోవైపు సెప్టెంబరు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 7న ఆన్ లైన్‌లో రిలీజ్ చేయనుంది టీటీడీ. సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు వెల్లడించింది.

NOTE:

శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లొచ్చు…

తదుపరి వ్యాసం