TTD online Tickets: టీటీడీ ఆన్‌లైన్ టిక్కెట్ల విడుదల, అందుబాటులో అక్టోబర్ కోటా
23 July 2024, 12:18 IST
- TTD online Tickets: టీటీడీ ఆన్‌లైన్ టిక్కెట్లు మంగళవారం విడుదలయ్యాయి.
అక్టోబర్ కోటా ఆన్‌లైన్ టిక్కెట్లు విడుదల
TTD online Tickets: తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ టిక్కట్లు విడుదల అయ్యాయి. నేటి నుంచి శ్రీవారి అక్టోబర్ నెల కోటా దర్శనం టికెట్లు ఆన్‌లైన్ పొందొచ్చు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
మంగళవారం జూలై 23నుంచి శ్రీవారి అక్టోబర్ నెల దర్శనం టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకే అక్టోబర్ 4 నుంచి 10 వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను టీడీపీ విడుదల చేసింది. టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల ఆన్‌లైన్ కోటను తిరుమల శ్రీవాణిట్రస్టు ఉదయం 11 గంటలకు విడుదల చేసింది.
వికలాంగులు, వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఉచిత ప్రత్యేక దర్శనం చేసేందుకు టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
బుధవారం (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. అలాగే తిరుపతి, తిరుమలలో అక్టోబర్ నెలలో రూమ్ (గదులు)ల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ చేయనుంది. తిరుపతి-తిరుమల శ్రీవారి సేవ కోటా టికెట్లను జులై 27న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవనీత సేవ కోటా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జులైన 27న పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుపతి వెళ్లే శ్రీవారి యాత్రికులు టీటీడీ అధికారక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకే అక్టోబర్ 4 నుంచి 10 వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
పోటెత్తిన భక్తులు
మరోవైపు టీటీడీకి యాత్రికుల రద్దీ పెరిగింది. భక్తులు పోటెత్తడంతో కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ అయ్యాయి. 30 కంపార్ట్‌మెంట్‌ల్లో యాత్రికులు వేచి ఉంటున్నారు. అలాగే యాత్రికుల సర్వదర్శనానికి కనీసం 16 నుంచి 18 గంటల సమయం పట్టింది.
రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఒక్కరోజే 75,963 మంది యాత్రికులు దర్శించుకున్నారు. అందులో 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే టీటీడీకి రూ.3.99 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)