తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Svims : తిరుప‌తి స్విమ్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నోటిఫికేష‌న్‌ విడుదల, దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ

Tirupati SVIMS : తిరుప‌తి స్విమ్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నోటిఫికేష‌న్‌ విడుదల, దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu

21 July 2024, 18:56 IST

google News
    • Tirupati SVIMS : తిరుప‌తిలోని శ్రీ‌వెంక‌టేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్విమ్స్‌)లో మెడికల్ గ్రాడ్యుయేట్‌లకు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్‌)ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది.
తిరుప‌తి స్విమ్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నోటిఫికేష‌న్‌ విడుదల, దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ
తిరుప‌తి స్విమ్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నోటిఫికేష‌న్‌ విడుదల, దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ

తిరుప‌తి స్విమ్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నోటిఫికేష‌న్‌ విడుదల, దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ

Tirupati SVIMS : తిరుపతి స్విమ్స్‌ లో 2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఫెలోషిప్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆస‌క్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు జులై 26న వ‌ర‌కు గ‌డువు ఉంది. జులై 27న అభ్యర్థుల స‌ర్టిఫికేట్లను ప‌రిశీలిస్తారు. జులై 29న కౌన్సెలింగ్ ఉంటుంది. ఆగ‌స్టు 5 నుంచి ప్రోగ్రామ్ ప్రారంభ‌మవుతుంది.

పీడీఎఫ్ కోర్సులు...సీట్లు

పీడీఎఫ్ కోర్సులు నాలుగు ఉన్నాయి. అవి ఏడాది పాటు కాల వ్యవ‌ధితో ఉన్నాయి. పీడియాట్రిక్ సీటీ సర్జరీ కోర్సుకు సంబంధించి రెండు సీట్లు ఉన్నాయి. దీనికి అర్హత ఎంసీహెచ్‌, డీబీఎన్ సీటి స‌ర్జరీ. పీడియాట్రిక్ కార్డియాలజీ (ఇంటర్వెన్షనల్) కోర్సుకు సంబంధించి ఒకే ఒక సీటు ఉంది. దీనికి అర్హత డీఎం, డీఎన్‌బీ కార్డియాల‌జీ. ఈ రెండు కోర్సుల‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.1 ల‌క్ష ఉంటుంది. అయితే ఫెలోషిప్‌కు ఎంపిక అయిన అభ్యర్థులు స్టైఫండ్ కింద నెల‌కు రూ.1.40 ల‌క్షల ఇస్తారు.

పీడియాట్రిక్ కార్డియాలజీ (క్లినికల్) కోర్సు, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీషియా కోర్సుల్లో రెండేసి సీట్లు చొప్పున ఉన్నాయి. ఈ రెండు కోర్సుల‌కు ఒక్కోదానికి ట్యూష‌న్ ఫీజు ఏడాదికి రూ.1 ల‌క్ష ఉంటుంది. అయితే ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థుల‌కు స్టైఫండ్ కింద నెల‌కు రూ.75 వేలు ఇస్తారు. అయితే పీడియాట్రిక్ కార్డియాలజీ (క్లినికల్) కోర్సుకు అర్హత ఎండీ, డీఎన్‌బీ పీడియాట్రిక్, అలాగే పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీషియా కోర్సుకు అర్హత ఎండీ, డీఎన్‌బీ అన‌స్థీషియా చేసి ఉండాలి.

ఈ ఫెలోషిప్‌ల‌కు అప్లై చేయ‌డానికి పూర్తికాలం ఉద్యోగులు అయితే నో అబ్జిక్షన్ స‌ర్టిఫికేట్ (ఎన్ఓసీ) అంద‌జేయాలి. ఈ ఫెలోషిప్‌ల‌కు ఇంటర్య్వూ, ప‌నితీరు ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల‌కు ప్రాధాన్యత ఇస్తారు. ద‌ర‌ఖాస్తును యూనివ‌ర్శిటీ అధికార‌క వెబ్‌సైట్ https://svimstpt.ap.nic.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అప్లికేష‌న్ పూర్తి చేసిన తరువాత, సంబంధిత స‌ర్టిఫికేట్ల జిరాక్స్ కాపీల‌ను జ‌త చేయాలి. రూ. 700 డీడీ తీసి అప్లికేష‌న్‌ను జ‌తచేయాలి. డీడీని favour of the Director, SPCHC, Tirupati పేరు మీద జాతీయ బ్యాంకుల్లో డీడీ తీయాలి. అప్లికేష‌న్‌ను The Director, Sri Padmavathi Children’s Heart Centre, Alipiri Road, Tirupati - 517507 అడ్రస్‌కి పంపాలి. ఈ ఈమెయిల్‌ spchcttd@gmail.com కి అయినా పంపాలి. జులై 26 సాయంత్రం 5 గంట‌ల లోపు పంపాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం