SVIMS PG Admissions: తిరుప‌తి స్విమ్స్‌లో పీజీ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగష్టు 8వరకు దరఖాస్తు గడువు-notification released for pg courses in tirupati swims application deadline 8th august ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Svims Pg Admissions: తిరుప‌తి స్విమ్స్‌లో పీజీ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగష్టు 8వరకు దరఖాస్తు గడువు

SVIMS PG Admissions: తిరుప‌తి స్విమ్స్‌లో పీజీ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఆగష్టు 8వరకు దరఖాస్తు గడువు

HT Telugu Desk HT Telugu
Jul 15, 2024 01:55 PM IST

SVIMS PG Admissions: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో న‌డిచే శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్విమ్స్‌) యూనివ‌ర్శిటీ 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గాను అడ్మిష‌న్ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు
తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు

SVIMS PG Admissions: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో న‌డిచే శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్విమ్స్‌) యూనివ‌ర్శిటీ 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గాను అడ్మిష‌న్ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం తొమ్మిది పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సుల్లో ప్ర‌వేశానికి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆగ‌స్టు 8 వ‌ర‌కు గ‌డువు నిర్ణ‌యించింది.

ద‌ర‌ఖాస్తు చేసేందుకు అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రూ.5,900 కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు రూ.4,956గా ఉంది. The Director,SVIMS, Tirupati పేరు మీద డీడీ చెల్లించాలి. డీడీని అప్లికేష‌న్‌తోపాటు The Registrar, Sri Venkateswara Institute of Medical Sciences, Alipiri Road, Tirupati - 517 507 అడ్ర‌స్‌కు పోస్టు చేయాలి. అప్లికేష‌న్ యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://svimstpt.ap.nic.in/ లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేష‌న్ ఆగ‌స్టు 8న సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌ర‌కు చేరుకోవాలి.

కోర్సులు...సీట్లు

స్విమ్స్‌లో మొత్తం తొమ్మిది పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సులు ఉండ‌గా, అందులో 100 సీట్లు ఉన్నాయి. కోర్సుల‌ను బ‌ట్టీ సీట్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎంఎస్సీ న‌ర్సింగ్ కోర్సులో 33 సీట్లు ఉన్నాయి. అందులో చైల్డ్ హెల్త్ న‌ర్సింగ్ 6 సీట్లు, ప్రసూతి అండ్ గైనకాలజీ నర్సింగ్ 8 సీట్లు, కమ్యూనిటీ హెల్త్ న‌ర్సింగ్ 7 సీట్లు, సైకియాట్రీ నర్సింగ్ 6 సీట్లు, మెడిక‌ల్ స‌ర్జిక‌ల్ న‌ర్సింగ్ 6 సీట్లు (కార్డియాల‌జీ అండ్ సీటీఎస్ న‌ర్సింగ్- 2, ఆంకాలజీ నర్సింగ్ -2, నెఫ్రో-యూరాలజీ నర్సింగ్-2) ఉన్నాయి. ఈ కోర్సుకు అర్హ‌త బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఎస్సీ ఆన‌ర్స్ న‌రింగ్, పోస్టు బేసిక్ న‌ర్సింగ్‌లో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. ప్ర‌వేశ ప‌రీక్ష వంద మార్కుల‌కు ఉంటుంది. బీఎస్సీ న‌ర్సింగ్ స్టాండ‌ర్డ్స్ ప్ర‌శ్న‌లు ఉంటాయి. అందులో మెరిట్ వ‌చ్చిన వారిని ఎంపిక చేస్తారు.

మాస్ట‌ర్‌ ఆఫ్ ఫిజియోథెర‌పీ (ఎంపీటీ) కోర్సులో 27 సీట్లు ఉన్నాయి. అందులో ఆర్థోపెడిక్స్ 9 సీట్లు, న్యూరాలజీ 6 సీట్లు, కార్డియోథొరాసిక్ 9 సీట్లు, స్పోర్ట్స్ 3 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు అర్హ‌త బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజియోథెర‌ఫీ (బీపీటీ)లో ఉత్తీర్ణ‌త సాధించాలి. అలాగే 2024 ఆగ‌స్టు 31 నాటికి ఇంట్రెన్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. బీపీటీ స్టాండ‌ర్డ్స్ ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌వేశ‌పరీక్ష ఉంటుంది. వంద మార్కులు ఉండే ఈ పరీక్ష‌లో మెరిట్‌ను ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఎంఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ (ఎహెచ్ఎస్‌), ఎంఆర్ఎస్‌ కోర్సులలో పీజీ డిప్లొమా సీట్లు 17 సీట్లు, ఎంఎస్సీ ఎకోకార్డియోగ్ర‌ఫ్రీ (ఎకో)కు 1 సీటు, ఎంఎస్సీ కార్డియాక్ కాథెట‌రైజేష‌న్ ఇంట‌ర్వెన్ష‌న్ టెక్నాల‌జీ (సీసీఐటీ)కు 1 సీటు ఉంది. ఈ కోర్సుల‌కు అర్హ‌త బీఎస్సీ సీవీటి, బీఎస్సీ డిగ్రీ+ ఈసీజీ, సీవీటీలో రెండేళ్ల పీజీ డిప్లొమా + మూడేళ్ల అనుభవం ఉండాలి. కరస్పాండెన్స్ కోర్సు పరిగణించబడదు.

ఎంఎస్సీ డ‌యాల‌సిస్ టెక్నాల‌జీ కోర్సులో రెండు సీట్లు ఉన్నాయి. దీనికి అర్హ‌త బీఎస్సీ డ‌యాల‌సిస్ టెక్నాల‌జీ చేసి ఉండాలి. ఎంఎస్సీ కార్డియో ప‌ల్మ‌న‌రీ పెర్ఫ్యూజ‌న్ టెక్నాల‌జీ (సీపీపీటీ) కోర్సులో రెండు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు అర్హ‌త బీఎస్సీ కార్డియో ప‌ల్మ‌న‌రీ పెర్ఫ్యూజ‌న్ టెక్నాల‌జీ (బీఎస్సీ సీపీపీటీ), బీఎస్సీ పెర్ఫ్యూజ‌న్ టెక్నాల‌జీ స‌మాన‌మైన కోర్సులు, బీఎస్సీ డిగ్రీ+ సీపీపీటీలో రెండేళ్ల పీజీ డిప్లొమా ఉండాలి. కరస్పాండెన్స్, సీపీపీటీలో డిప్లొమా అభ్య‌ర్థుల‌ను పరిగణించబడదు. బీఎస్సీ పెర్ఫ్యూజ‌న్ టెక్నాల‌జీ చేసిన అభ్య‌ర్థుల‌ను కూడా అనుమ‌తించ‌బ‌డ‌దు.

ఎంఎస్సీ క్లినిక‌ల్ వైరాల‌జీ కోర్సులో రెండు సీట్లు ఉన్నాయి. దీనికి అర్హ‌త బీఎస్సీ మైక్రోబ‌యోల‌జీ, బ‌యోటెక్నాల‌జీ, జూవాల‌జీ, బొట‌నీ చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ మెడిక‌ల్ రికార్డ్ సైన్స్ (ఎంఆర్ఎస్‌) కోర్సులో తొమ్మిది సీట్లు ఉన్నాయి. దీనికి అర్హ‌త ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త అయి ఉండాలి.

ఎంఎస్సీ అలైడ్ హెల్ సైన్స్‌స్‌, ఎంఆర్ఎస్ పీజీ డిప్లొమా కోర్సుల‌కు ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వార సీటు కేటాయిస్తారు. డిగ్రీ మార్కులు, ప్ర‌వేశ‌ప‌రీక్ష మార్కుల‌ను బ‌ట్టీ 80ః20 నిష్ప‌త్తిలో ఎంపిక చేస్తారు. ప్ర‌వేశ‌ప‌రీక్ష ఇంగ్లీష్ 30 శాతం, లాజిక‌ల్ రీజ‌నింగ్ 30 శాతం, బ‌యోల‌జీ 20 శాతం, పిజిక‌ల్ సైన్సెస్ 20 శాతం ఇంట‌ర్మీడియట్ స్థాయిలో ఉంటుంది.

ప్ర‌వేశ పరీక్ష

పైన పేర్కొన్న పీజీ న‌ర్సింగ్ కోర్సుల‌కు సంబంధించిన ప్ర‌వేశ ప‌రీక్ష ఆగ‌స్టు 19న ఉంటుంది. ఎంఎస్సీ న‌ర్సింగ్‌కు సంబంధించి మెరిట్ జాబితాను ఆగ‌స్టు 22న వెల్ల‌డిస్తారు. ఆగ‌స్టు 31న మొద‌టి కౌన్సింగ్ ఉంటుంది. సెప్టెంబ‌ర్ 11 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి. మాస్ట‌ర్ ఆఫ్ ఫియోథెర‌ఫీ, ఎంఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ (ఎహెచ్ఎస్‌), ఎంఆర్ఎస్‌ కోర్సులలో పీజీ డిప్లొమా కోర్సులు సంబంధించి మెరిట్ జాబితాను ఆగ‌స్టు 24న వెల్ల‌డిస్తారు. సెప్టెంబ‌ర్ 4న మొద‌టి కౌన్సింగ్ ఉంటుంది. సెప్టెంబ‌ర్ 23 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి.

పోస్టు బేసిక్ డిప్లొమా ఇన్ న‌ర్సింగ్ ప్రోగ్రామ్స్ 23 సీట్లు, కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ క్యాథెట‌రైజేష‌న్ ల్యాబొరేట‌రీ న‌ర్సింగ్ కోర్సుకు 6 సీట్లు, సీటీ స‌ర్జ‌రీ న‌ర్సింగ్ కోర్సుకు 6 సీట్లు, పెరిటోనియ‌ల్ డ‌యాల‌సిస్ న‌ర్సింగ్ కోర్సుకు 2 సీట్లు, హెమో డ‌యాల‌సిస్ న‌ర్సింగ్ కోర్సుకు 2 సీట్లు, రీన‌ల్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ న‌ర్సింగ్ కోర్సుకు 2 సీట్లు, అంకాల‌జీ న‌ర్సింగ్ కోర్సుకు 5 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల‌కు అర్హ‌త బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. అయితే ఎటువంటి ప్ర‌వేశ పరీక్ష ఉండ‌దు. బీఎస్సీ న‌ర్సింగ్‌లోని వ‌చ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే నెల‌కు రూ.5,000 స్ట‌యిఫండ్ కూడా ఇస్తారు. మెరిట్ జాబితా ఆగ‌స్టు 19న విడుద‌ల చేస్తారు. ఆగ‌స్టు 31న మొద‌టి కౌన్సింగ్ ఉంటుంది. సెప్టెంబ‌ర్ 11 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి.

రిజ‌ర్వేష‌న్లు

సామాజిక వ‌ర్గాలు వారీగా ఎస్సీ 15 శాతం, ఎస్టీ 6 శాతం సీట్లు కేటాయిస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు లేక‌పోతే, ఆ సీట్ల‌ను ఓపెన్ కేట‌గిరీలో పెడ‌తారు. బీసీ 29 శాతం (బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-4 శాతం), ఈడ‌బ్ల్యూఎస్ కోటా 10 శాతం సీట్లు కేటాయిస్తారు. 85 శాతం సీట్లు స్థానికుల‌కే కేటాయిస్తారు. అలాగే శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ ప‌రిధి వారికే ఇస్తారు. పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు, నంద్యాల‌, శ్రీ‌స‌త్య‌సాయి, వైఎస్ఆర్ క‌డ‌ప‌, చిత్తూరు, అన్న‌మ‌య్య‌, తిరుప‌తి, అనంత‌పురం, క‌ర్నూల్ వారికే 85 శాతం సీట్లు ఉంటాయి. క‌నీసం నాలుగేళ్లు ఆ ప్రాంతంలో చ‌దివి ఉంటే, వారిని స్థానికులుగా ప‌రిగణిస్తారు. అలాగే టీటీడీ, స్వీమ్స్‌లో చ‌దివిన‌వారికి కూడా ప్ర‌త్యేక కోటా ఉంటుంది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner