Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్, ఏప్రిల్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల తేదీలివే!
17 January 2024, 19:01 IST
- Tirumala Darshan Tickets : శ్రీవారి దర్శన టికెట్లు ఏప్రిల్ కోటాను రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్
తిరుమల దర్శన టికెట్లు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఏప్రిల్ నెల కోటా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాదన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం 18వ తేదీ ఉదయం గం.10 లకు నుంచి 20వ తేదీ ఉదయం గం.10లకు వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదీ ఉదయం గం.10 లకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ సేవా టోకెన్లను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వసంతోత్సవం సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
24న ప్రత్యేక దర్శనం టోకెన్లు
ఈ నెల 23వ తేదీ ఉదయం గం.10లకు అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం గం.11 లకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 స్పెషల్ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం గం.11 నుంచి శ్రీవారి సేవా కోటా టికెట్లు విడుదల చేయనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సెలవుల కారణంగా గత మూడు రోజులుగా శ్రీవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి మెట్ల మార్గంలో వేలాది మంది భక్తులు గోవిందానామస్మరణతో కాలినడకన ఆలయానికి వస్తున్నారు. నిన్న శ్రీవారిని 73,016 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,915 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా శ్రీవారికి నిన్న రూ.3.46 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు 25 కంపార్ట్‌మెంట్లు వేచిఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది.